Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా యాక్టింగ్ స్కిల్స్‌ నాకు నచ్చదు.. కామెడీగా అనిపిస్తుంది: రణ్‌బీర్

బాలీవుడ్ చాక్లెట్ బాయి రణ్‌బీర్‌ కపూర్‌ అఫీషియల్‌గా ఇద్దరు హీరోయిన్స్‌తో ప్రేమ వ్యవహారం నడిపాడు. వారు దీపిక పదుకునే, కత్రినా కైఫ్‌. మొదట దీపికతో పీకల్లోతు ప్రేమలో మునిగిన రణ్‌బీర్ బ్రేకప్ ఇచ్చుకుని కత

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (17:43 IST)
బాలీవుడ్ చాక్లెట్ బాయి రణ్‌బీర్‌ కపూర్‌ అఫీషియల్‌గా ఇద్దరు హీరోయిన్స్‌తో ప్రేమ వ్యవహారం నడిపాడు. వారు దీపిక పదుకునే, కత్రినా కైఫ్‌. మొదట దీపికతో పీకల్లోతు ప్రేమలో మునిగిన రణ్‌బీర్ బ్రేకప్ ఇచ్చుకుని కత్రీనా వెంటపడ్డాడు. ఈ జంట పెళ్లి చేసుకుంటుదని కూడా ప్రచారం జరిగింది. అయితే మధ్యలో ఏమైందో మళ్ళీ గుడ్ బై చెప్పుకున్నారు. 
 
గతంలో ఓ షోలో బాగంగా కత్రినాను ఉద్దేశించి కరణ్ కొన్ని ప్రశ్నలేశాడు. కత్రినా నటనపై నీకామెంట్ అని బాలీవుడ్ హీరో, ప్రస్తుత దీపికా బాయ్‌ఫ్రెండ్ రణ్‌వీర్‌ సింగ్‌‌ని కరణ్ అడిగాడు. దీనికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు రణ్‌వీర్‌ సింగ్‌. ''సినిమా మొత్తంలో ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వగల హీరోయిన్ కత్రినా'' అంటు హేళన చేశాడు‌. పక్కనే వున్న కత్రినా మాజీ ప్రియుడు రణ్‌బీర్‌ కూడా ఈ సమాధానానికి నవ్వుకున్నాడు. 
 
ప్రస్తుతం మాజీ గర్ల్ ఫ్రెండ్ దీపికా పదుకునేపై కూడా రణ్ బీర్ సింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రణబీర్ కపూర్.. అలియాభట్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. ఇక దీపికా.. రణవీర్ సింగ్‌ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా.. రణబీర్‌తో బ్రేకప్ అయిన తరువాత అతడితో కలిసి సినిమాలు చేసింది దీపికా. అయితే మొన్నామధ్య దీపికా.. రణబీర్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ కామెంట్స్ చేసింది.
 
అప్పటినుండి వీరిద్దరికీ మధ్య పొసగడం లేదు. రణబీర్ ఎవరికీ అర్ధం కాడని, ఏ టైమ్‌లో ఎలా ఉంటాడో.. ఏం ఆలోచిస్తాడో ఎవరికీ తెలియదని. తనకు ఫీలింగ్స్ బయట పెట్టడం రాదని.. ఇప్పటికైనా నేర్చుకుంటాడని భావిస్తానని దీపికా కామెంట్స్ చేసింది. తాజాగా రణబీర్‌కి దీపికా యాక్టింగ్ స్కిల్స్ మీద మీ కామెంట్ ఏంటి..? అని ప్రశ్న ఎదురైంది. తనకు దీపికా యాక్టింగ్ స్కిల్స్ పెద్దగా నచ్చదు.. ఆమెని చూస్తే కామెడీగా అనిపిస్తుంటుందని సంచలన కామెంట్స్ చేశాడు. మరి ఈ కామెంట్స్‌పై దీపికా పదుకునే ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments