Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. మళ్లీ అనుష్కతో స్నేహమేనంటున్న ప్రభాస్..

బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, దేవసేన అనుష్కల మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ ఖండించినా.. ఉన్నట్టుండి.. ప్రముఖ విశ్లేషకుడు ఉమైర్ సం

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (21:20 IST)
బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, దేవసేన అనుష్కల మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ ఖండించినా.. ఉన్నట్టుండి.. ప్రముఖ విశ్లేషకుడు ఉమైర్ సంధు తన ట్వీట్లతో వీరి బంధాన్ని సెన్సేషన్ చేశాడు. డిసెంబరులో నిశ్చితార్థం అంటూ.. వారిద్దరి మధ్య సుమారు ఏడేళ్ల బంధం వుందని.. సరైన టైమ్‌లో వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమైర్ ట్వీట్స్ చేయడంతో.. ప్రభాస్, అనుష్కల ప్రేమాయణం మళ్లీ హైలైట్ అయ్యింది. 
 
అయితే ప్రస్తుతం ఈ ట్వీట్స్ లోనూ నిజం లేదని చెప్పేందుకు ప్రభాస్ రంగంలోకి దిగాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అనుష్కతో బంధంపై ప్రభాస్ తమతో మాట్లాడినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. అనుష్కతో తొమ్మిది సంవత్సరాల పాటు సినిమాలు చేస్తున్నామని ప్రభాస్ తెలిపారు. అప్పటి నుంచి తమ మధ్య బంధం ఉంది. అయితే అది కేవలం స్నేహం మాత్రమే. అంతకుమించి తమ మధ్య ఎలాంటి బంధాలు లేవని ప్రభాస్ వివరణ ఇచ్చినట్లు తెలిపింది.
 
అయితే ఇది నిజమా కాదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే ప్రభాస్ స్వయంగా తన అధికారికంగా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే వరకు ఈ ఎంగేజ్‌మెంట్, రిలేషన్ వార్తలు కొనసాగుతూనే ఉంటాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్

జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments