Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్ ఎంతో తెలుసా? 2017లో వేసుకున్నది మళ్లీ ఇప్పుడు...

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (17:53 IST)
బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సీతారామం చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరయ్యారు. చాలాకాలం తర్వాత తమ అభిమాన నటుడిని పబ్లిక్ ఈవెంట్‌లో చూస్తున్నందుకు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రభాస్ చాలా సాదాసీదాగా కనిపించారు.

 
సాధారణ దుస్తులను ధరించాడు. సీతారామం ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభాస్ ధరించిన టీ-షర్ట్ ధర గురించి చర్చించుకున్నారు. ఆ టీ-షర్ట్ సుమారు రూ. 20,000 వుంటుందనీ, అచ్చం ఇలాంటి టీషర్ట్ 2017లో వేసుకున్నాడనీ అంటున్నారు. ఐతే... ఇప్పుడు వేసుకున్నది పాత టీషర్టా లేదంటే కొత్తదా అంటూ చర్చించుకుంటున్నారు.

కాగా ఈ చిత్రం గురించి ప్రభాస్ మాట్లాడుతూ... ''సీతారామం లాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. స్వ‌ప్నదత్ అద్భుతంగా డిజైన్ చేసి క‌శ్మీర్‌లో చ‌లిలోనూ, క‌రోనా టైంలో డేర్‌గా సినిమాను తీసింది. ఆమె కోస‌మే నేను వ‌చ్చాను. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి సీతా రామం సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు వున్నాడు అని గుడికి వెళ్ళడం మనేస్తామా... ఇది అంతే. మాకు థియేటర్స్ గుడులు లాంటివి. తప్పకుండా సినిమాని థియేటర్లో చూడండి అని ప్ర‌భాస్ అన్నారు. చ‌క్క‌టి సంగీత‌భ‌రిత చిత్రంగా సీతారామం రూపొందింది. అన్ని ఎమోష‌న్స్ ఇందులో వున్నాయ‌ని అశ్వ‌నీద‌త్ తెలిపారు.

 
సీతా రామంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ పీరియాడికల్ డ్రామాలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషించింది. ఇందులో తరుణ్ భాస్కర్, సుమంత్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments