Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో విశాల్ పెళ్లి.. నడిగర్ సంఘం కొత్త భవనంలోనే.. వధువు వరమ్మేనా?

పందెంకోడి హీరో విశాల్ వివాహం చేసుకోబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఆర్కే నగర్ ఎన్నికల బరిలోకి దిగి నిర్మాతల సంఘం అభ్యర్థుల నుంచి అసంతృప్తిని మూటగట్టుకున్న విశాల్.. జనవరిలో వివాహం చేసుకోబ

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (13:37 IST)
పందెంకోడి హీరో విశాల్ వివాహం చేసుకోబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఆర్కే నగర్ ఎన్నికల బరిలోకి దిగి నిర్మాతల సంఘం అభ్యర్థుల నుంచి అసంతృప్తిని మూటగట్టుకున్న విశాల్.. జనవరిలో వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిర్మాతల సంఘంలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీకి దిగిన విశాల్‌పై చాలామంది నిర్మాతలు గుర్రుగా వున్నారు. 
 
విశాల్‌ను నడిగర్ సంఘం నుంచి తప్పించేందుకు సిద్ధంగా వున్నట్లు కూడా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో నడిగర్ సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన విశాల్ చెన్నై విమానాశ్రయంలో ఆసక్తికర కామెంట్లు చేశాడు. నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని.. జనవరిలో ప్రారంభోత్సవం వుంటుందని విశాల్ ప్రకటించాడు. 
 
పనిలో పనిగా ఆ భవనం కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని విశాల్ ప్రకటించాడు. ఈ మేరకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లు విశాల్ వ్యాఖ్యానించాడు. దీంతో విశాల్ వివాహం చేసుకోబోతున్న వధువు ఎవరు అనే దానిపై చర్చ సాగుతోంది. ఇప్పటికే శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమలో వున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వస్తున్న వేళ.. విశాల్ ఆమెనే వివాహం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విశాల్-వరలక్ష్మి ప్రేమ బంధంతో ఒక్కటవుతారా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments