Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ద్విలింగ సంపర్కుడిని.. గర్వంగా ఫీలవుతున్నా : బాలీవుడ్ నిర్మాత

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (11:25 IST)
చాలా మంది తమ లోపాలను బయటకు చెప్పేందుకు సంకోచిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం ఏమాత్రం బిడియం లేకుండా చెపుతుంటారు. ఈ కోవలో బాలీవుడ్ నిర్మాత, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వికాస్ గుప్తా ఓ విషయాన్ని బహిర్గతం చేశారు. తాను ద్విలింగ సంపర్కుడు (బైసెక్సువల్) అని ప్రకటించాడు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 'నేను స్త్రీ , పురుషుల‌లో ఎవ‌రితోనైన ప్రేమ‌లో ప‌డతాను. నాలాంటి వారు ఎంద‌రో ఉన్నారు. ఈ విష‌యాన్ని చెప్ప‌డానికి నేను గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. బెదిరింపుల వ‌ల‌న ఈ విష‌యం నేను చెప్ప‌డం లేదు' అని వికాస్ గుప్తా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
అయితే బైసెక్సువ‌ల్ వ‌ల‌న తాను ఎన్నో ఇబ్బందులు ప‌డ్డ‌ట్టు వికాస్ పేర్కొన్నారు. నా ప్ర‌వ‌ర్త‌న చూసి నా ఫ్యామిలీ ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. నా తల్లి కూడా న‌న్ను అస‌హ్యించుకుంది. న‌న్ను అవ‌మానించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. వారిని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను. 
 
పార్థ్‌సంతాన్, ప్రియాంక శర్మలకు ధన్యవాదాలు. వారు నాకు చేసిన అవమానాల వల్ల నేను మరింత శక్తివంతంగా తయారయ్యాను. దేవుడు ఎలా సృష్టించారో నేను అలా మారాను. ఈ క‌ష్ట స‌మ‌యంలో నాతో అండ‌గా నిలిచిన వారికి ధ‌న్య‌వాదాలు అని వికాస్ స్ప‌ష్టం చేశారు.
 
మరోవైపు, వికాస్ గుప్తా నిజాయితీపై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయనను ఎవరూ ఎగ‌తాళి చేయోద్ద‌ని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments