Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అభినందన్' పాత్రలో విజయ్ దేవరకొండ : ఎప్పటికీ సంతోషంగా ఉంచుతానమ్మా అంటూ...

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (18:12 IST)
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గురించి తెలియని భారతీయులు ఉండరు. శత్రువుల చేతుల్లో చిక్కినప్పటికీ మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శిచిన తిరిగి స్వదేశానికి సగర్వంగా తిరిగివచ్చిన భారత వైమానిక దళం సైనికుడు. అంతేనా.. చావుకోరల్లో చిక్కుకున్నప్పటికీ.. శత్రుసైన్యానికి ఒక్క రహస్యం కూడా వెల్లడించని యుద్ధ విమాన పైలెట్. ఈయన దేశంలో అమాంతం రియల్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 
 
ఇపుడు అభినందన్ పాత్రలో టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ టీ సిరీస్ నిర్మాణంలో వచ్చే ఈ చిత్రంలో విజయ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.
 
మరోవైపు, విజయ్ దేవరకొండ తల్లి మాధవి గురువారం 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే అమ్మా" అంటూ ట్వీట్ చేశారు. 'నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటానమ్మా' అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో కూడా పోస్టు చేశారు.
 
అందులో విజయ్ దేవరకొండ, ఆయన తల్లి, సోదరుడు క్రికెట్ షాట్ కొడుతున్న సరదా సన్నివేశం చూడొచ్చు. హ్యాపీ 50 అమ్మా అంటూ విజయ్ పేర్కొన్నారు. తల్లి రియల్ లైఫ్‌లో అర్థ సెంచరీ పూర్తి చేసుకుందంటూ పైవిధంగా తెలియజేశారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. ఆమె హైదరాబాదులో పలు వేదికలపై వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇస్తుంటారు.
 
కాగా, విజయ్ తల్లి బర్త్ డే పార్టీకి ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న కూడా విచ్చేసింది. విజయ్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో రష్మిక ప్రధాన ఆకర్షణగా నిలవడం గమనార్హం. వీరిద్దరూ "గీతగోవిందం" చిత్రంలో తొలిసారి కలిసి నటించిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో విజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayamma’s 69th Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

కారు ప్రమాదానికి గురైన అజిత్- కారు రేసును ఫ్యామిలీ కోసం వదులుకోరా? (video)

రియల్ కాదు రీల్.. రీల్స్ చేస్తూ రైలు నుంచి దూకేసింది.. అత్యాచారం జరగలేదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments