Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యాబాలన్‌పై కిడ్నాప్ - హత్య కేసులు నమోదు... ఎవరిని హత్య చేశారు?

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌పై కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. దీంతో ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయండి అంటూ, సోషల్ మీడియాలో ఓ పోస్టర్ దర్శనమిస్తోంది. ప్రస్

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (14:43 IST)
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌పై కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. దీంతో ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయండి అంటూ, సోషల్ మీడియాలో ఓ పోస్టర్ దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇదంతా నిజం కాదండోయ్... అంతా ఉత్తుత్తిదే అంటూ ఓ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విద్యాబాలన్ ట్విట్టర్ ఖాతాలో చాలా వెరైటీగా పోస్ట్ చేసింది. 
 
అయితే ఈ ఫోటోకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. విద్యా బాలన్ నటిస్తున్న 'కహానీ-2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో విద్యా దుర్గా రాణీ సింగ్ పాత్రను పోషిస్తోంది. విద్యాబాలన్ గతంలో ప్రధానపాత్ర పోషించి నటించిన కహానీ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. కనపడకుండా పోయిన తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఓ గర్భిణీ ఎలా ముందుకెళ్లిందనే ఇతివృత్తంతో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన కహాని చిత్రం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి కాసుల వర్షాన్నికురిపించింది. 
 
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌గా 'కహానీ-2' తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇలా వెరైటీగా పోస్ట్ చేశారు. విద్యాబాలన్, అర్జున్ రాంపాల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. ఇక రిలీజ్ డేట్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్... ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అప్పుడే అనౌన్స్ చేశారు. బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్... సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments