సమంత వల్లనే వరుణ్-లావణ్య పెళ్లి జరిగిందట

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (23:12 IST)
కర్టెసి-ట్విట్టర్
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల ప్రేమ పెళ్లి తెలిసిందే. వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపి ఘనంగా వివాహం జరిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. అభిమానులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా వీరి పెళ్లికి సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. అదేంటయా అంటే.. వీరి ప్రేమకు కారణం సమంత అంట. సమంత కారణం ఎలాగ అనుకుంటున్నారు కదా. వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ చిత్రంలో హీరోయిన్ పాత్రకు దర్శకుడు శ్రీను వైట్ల తొలుత సమంతను అనుకున్నారట. ఆ ప్రకారంగా కథను సమంతకి వినిపించగా.. ఆ పాత్రలో తను నటించనని తిరస్కరించిందట. దాంతో శ్రీను వైట్ల మరో హీరోయిన్ కోసం వెతికారట.
 
అలా వెతికే క్రమంలో లావణ్య త్రిపాఠి తన పాత్రకి చక్కగా సరిపోతుందనిపించి ఆమెకి స్టోరీ వినిపించాడట. ఆ పాత్రలో తను నటించడానికి ఓకే చెప్పిందట లావణ్య. అలా వరుణ్ తేజ్ పక్కన ఆమె ఆ చిత్రంలో నటించడంతో వారిరువురు మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా వచ్చిందని అంటున్నారు. కనుక ఆరోజు సమంత కనుక ఆ పాత్రలో నటించిందేకు అంగీకరించి వుంటే వరుణ్ తేజ్ లావణ్యను చూసే అవకాశం వుండేది కాదనీ, వారి పెళ్లి కూడా జరిగేది కాదేమోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments