Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌తో ప్రేమలో పడిన శరత్ కుమార్ కుమార్తె... ఆన్‌ స్క్రీన్‌పై రొమాన్స్‌కు సై...

హీరో శరత్ కుమార్‌కు, యువ హీరో విశాల్‌కు మధ్య వ్యక్తిగత వైరం ఎప్పటి నుంచో వుంది. తన కుమార్తె వరలక్ష్మిని ప్రేమలో పడేశాడన్న కోపం విశాల్‌పై ఉంది. పైగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్‌ ప్యానెల్‌ను విశ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (12:15 IST)
హీరో శరత్ కుమార్‌కు, యువ హీరో విశాల్‌కు మధ్య వ్యక్తిగత వైరం ఎప్పటి నుంచో వుంది. తన కుమార్తె వరలక్ష్మిని ప్రేమలో పడేశాడన్న కోపం విశాల్‌పై ఉంది. పైగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్‌ ప్యానెల్‌ను విశాల్ వర్గం చిత్తుగా ఓడించింది. దీంతో వారిద్దరి మధ్య వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ కుమార్తెతో ఆన్‌ స్క్రీన్‌పై రొమాన్స్ చేసేందుకు విశాల్ సిద్ధం కావడాన్ని శరత్ కుమార్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ప్రస్తుతం ఈ వార్తే కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. కలిసి నటించింది ఒకే ఒక్క సినిమాలో అయినా చిన్నప్పటి నుండి స్నేహితులు కావడంతో విశాల్ - వరలక్ష్మీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని కోలీవుడ్ వర్గాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి. శరత్ కుమార్‌తో వైరం కారణంగా బయటకు వ్యక్తం చేయడం లేదు కానీ... విశాల్... వరలక్ష్మీని వివాహం చేసుకునేది ఖాయమనీ కొందరంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో 'మదగజరాజా'లో తొలిసారి జోడీ కట్టిన ఈ జంట... ఇప్పుడు మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతోంది... విశాల్ నటించి, నిర్మించబోతున్న 'పందెం కోడి' సీక్వెల్‌లో వరలక్ష్మీ ఓ కీలక పాత్ర పోషించబోతోందట. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం తొలి భాగంలో మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించగా... ఇందులో కీర్తి సురేశ్ చేస్తోంది... అయితే మరో కీలకమైన పాత్రకు వరలక్ష్మీని ఎంపిక చేశారట. విశేషం ఏమంటే... ఇప్పటికే ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న వరలక్ష్మి... విశాల్ మీద ప్రేమతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చిందట... జులైలో సెట్స్ కెళుతున్న 'పందెం కోడి' సీక్వల్ ఈ లవర్స్‌ను ఇంకెంత దగ్గర చేస్తుందో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments