Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ప్రేమ, పెళ్లి అన్నీ సినిమాలే... సోషల్ మీడియా రాద్ధాంతం చేయొద్దు : వరలక్ష్మీ శరత్ కుమార్

కోలీవుడ్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నటుడు విశాల్‌కీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలా కాలంగా వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం గురించి వరలక్ష్మి తనకు బాల్యం నుంచి స్నేహితురాలు అని నటుడు వి

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (12:21 IST)
కోలీవుడ్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నటుడు విశాల్‌కీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలా కాలంగా వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం గురించి వరలక్ష్మి తనకు బాల్యం నుంచి స్నేహితురాలు అని నటుడు విశాల్ స్పందించారు గానీ, నటి వరలక్ష్మి మాత్రం నోరు మెదపకుండా సెలైంట్‌గా అంతా గమనిస్తూ వచ్చారు. అయితే ఇటీవల నటుడు విశాల్ తన పెళ్లి 2018 జనవరిలో జరగుతుందని, అందుకు కొత్తగా నిర్మించనున్న నడిగర్‌ సంఘంలోని హాలు వేదిక కానుందని వెల్లడించిన విషయం సంగతి తెలిసిందే. 
 
అలాంటిది ఇప్పటివరకూ మౌనంగా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా కాస్త ఘాటుగానే స్పందించారు. తన ప్రేమ, పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని అన్నారు. కాబట్టి ఈ విషయం గురించి ఇప్పటికే చాలా ఎక్కువగా ప్రచారం చేశారని అన్నారు. ఇకపై సామాజిక మాద్యమాలు రాద్దాంతం చేయవద్దని, తనకు ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి అన్నీ సినిమానేని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
ప్రేమ పవిత్రమైనది. అదో అనిర్వచనీయమైన అనుభవం అలాంటి మాటలు చాలా విన్నాం. అలాంటిది ప్రేమ పరిహాసంగా మారింది. అనే ఆవేదన మాటలు వినాల్సి వస్తోంది. ఈ హీరోయిన్ ఇలాంటి అపనమ్మకపు వ్యాఖ్యలను చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే తను ఎవరిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారన్నది క్లారిటీ లేకపోయినా, ఆమె వ్యాఖ్యలు మాత్రం మరోసారి కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. 
 
ఇటీవల దర్శకుడు ప్రియదర్శిన్, నటి లిజి సుమారు 14 ఏళ్లు కాపురం చేసి విడిపోయి విడాకులు పొందారు. అదే విధంగా రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య ఏడాదిగా భర్త అశ్విన్ కుమార్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాఖ్యలు రకరకాల ఊహలకు దారి తీస్తున్నాయంటున్నారు సినీ వర్గాలు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments