Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై మరో హాట్ యాంకర్.... ఉదయభాను.. అనసూయ... రష్మీ గౌతమ్.. ఇపుడు?

ఇటీవలి కాలంలో వెండితెరపై బుల్లితెర యాంకర్ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఎంతోమంది యాంకర్లు చిన్న పాత్రల్లో నటించారు. కానీ ఈ మధ్య హీరోయన్ల స్థాయిలో యాంకర్లు నటిస్తూ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే 'జబర్ధస్త్'

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (13:15 IST)
ఇటీవలి కాలంలో వెండితెరపై బుల్లితెర యాంకర్ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఎంతోమంది యాంకర్లు చిన్న పాత్రల్లో నటించారు. కానీ ఈ మధ్య హీరోయన్ల స్థాయిలో యాంకర్లు నటిస్తూ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే 'జబర్ధస్త్' కామెడీ షోతో పరిచయమైన హాట్ యాంకర్లు అనసూయ, రష్మీ, నీహారికలు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. వీరితో పాటు ఈ మద్య 'పటాస్' షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి కూడా వెండితెరపై మంచి అవకాశాలు దక్కించుకుంది. 
 
తాజాగా మరో హాట్ యాంకర్ కూడా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంది. ఇంతకీ ఎవరా హాట్ యాంకర్ అనుకుంటున్నారా...! పాపులర్ టీవీ షోస్లో తన మాటలు, ఆటలతో అలరించిన లాస్య. తక్కువ టైమ్లో బుల్లితెరపై మంచి యాంకర్గా పేరు తెచ్చుకున్న లాస్య ఇప్పుడు 'రాజా మీరు కేక' అనే చిత్రంలో వెండితెరపై మెరవబోతుంది. వీరికంటే ముందు ఉదయభాను, ఝాన్సీలు వెండితెరపై కనిపించిన విషయం తెల్సిందే. 
 
అయితే, లాస్య నటిస్తున్న చిత్రానికి కృష్ణ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఓ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందగా ఓ ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ నేపథ్యంలో కథ సాగనుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కే స్టూడియోస్‌పై ఎం.రాజ్ కుమార్ నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భయానకంగా భార్య హత్య, చంపడంలో చావు తెలివితేటలు, పోలీసులకు సవాల్

మత్తుకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు ఎలా ఉందో చూశారా? (Video)

భార్యకు బహుమతి ఇవ్వాలనీ.. తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న వైద్యుడు (Video)

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

తర్వాతి కథనం
Show comments