Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ మెడకు డ్రగ్ ఉచ్చు.. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఎఫెక్టేనా?

తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రదర్శకుల్లో ఒకడిగా గుర్తింపు పొందిన దర్శకుడు పూరీ జగన్నాథ్. తన 17 యేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అలాంటివాటిలో పవన్ కళ్యాణ్ - తమన్నా జం

Webdunia
గురువారం, 20 జులై 2017 (14:49 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రదర్శకుల్లో ఒకడిగా గుర్తింపు పొందిన దర్శకుడు పూరీ జగన్నాథ్. తన 17 యేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అలాంటివాటిలో పవన్ కళ్యాణ్ - తమన్నా జంటగా నటించిన చిత్రం "కెమెరామెన్ గంగతో రాంబాబు" ఒకటి. ఈ చిత్రం పూర్తిగా తెలంగాణ ఉద్యమం, తెరాస చీఫ్ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని తీశారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అంతేకాకుండా, ఈ చిత్రంలో మీడియా పవరేంటో కూడా చూపించారు పూరీ జగన్నాథ్. 
 
ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఏ విధంగా ప్రవర్తించారన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఓ పాత్రను కల్పించి, ఆ పాత్రను ప్రకాష్ రాజ్‌తో వేయించారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఈ చిత్రం విడుదలయ్యాక తెరాస కార్యకర్తలు ఈ చిత్ర ప్రదర్శనను కూడా అడ్డుకున్నారు. ఆ సమయంలోనే పూరీ జగన్నాథ్‌కు బెదిరింపులు కూడా వచ్చాయి. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఈ సమస్య అంతటితో సమసిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు.
 
కానీ, ఇపుడు హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారంతో బ్యాంకాక్ బ్యాచ్‌గా ముద్రవున్న దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బ్యాచ్‌కు విచారణ షురూ అయ్యింది. ఇందులోభాగంగా, తొలుత పూరీ వద్దే సిట్ దర్యాప్తు బృందం విచారణ జరిపింది. ఈ విచారణ ఏకంగా 11 గంటల పాటు సాగింది.
 
విచారణలో పూరీ చెప్పిన విషయాలతో పాటు.. ఆయన డ్రగ్స్ సేవిస్తున్నాడో లేదో నిర్దారించేందుకు కూడా రక్తం, వెంట్రుకలు, చేతులు, కాళ్ళ గోర్ల శాంపిల్స్‌ను కూడా సేకరించి హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. నాడు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా తమను కించపరిచేలా చేసినందుకే తెరాస నేతలు పూరీపై కక్ష కట్టారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. అందువల్లే ఈ డ్రగ్స్ కేసులో పూరీ బ్యాచ్‌ను ఇరికించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments