Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్: రవితేజ, నవదీప్, ఛార్మీ, ముమైత్, పూరీలకు ఎక్సైజ్ నోటీసులు?

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌ జోగుతుంది. ఆ మత్తును వదిలించేందుకు హైదరాబాదు పోలీసులు కార్యాచరణ మొదలెట్టారు. డ్రగ్స్‌ కేసు గుట్టు విప్పేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెడీ అయ్యింది. కాల్ లిస్ట్ కదిలించే కొద్దీ

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (10:30 IST)
డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌ జోగుతుంది. ఆ మత్తును వదిలించేందుకు హైదరాబాదు పోలీసులు కార్యాచరణ మొదలెట్టారు. డ్రగ్స్‌ కేసు గుట్టు విప్పేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెడీ అయ్యింది. కాల్ లిస్ట్ కదిలించే కొద్దీ ప్రముఖుల పేర్లంతా వెలుగులోకి వస్తున్నాయి. దర్శకులు మొదలుకొని.. ఆర్టిస్టుల దాకా డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్నారని తేలింది. ముఠాలో కొందరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ డ్రగ్స్ కేసులో ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ చెప్తున్నారు. 
 
ఇప్పటికే ఈ కేసులో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి యూనిట్ల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల డ్రగ్స్‌ రాకెట్‌‌లో దొరికిన నిందితుల కాల్‌ డేటాను అనేక మంది పేర్లు బయటపడ్డాయి. పక్కా ఆధారాల ప్రకారం కాల్ డేటాలో ఉన్న సినిమా ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. వాళ్లంతా  ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో టాస్క్‌ ఫోర్స్‌ ముందు హాజరుకావాలని ఆదేశించారు. అయితే సినిమా రంగానికి చెందిన వారిని డ్రగ్స్‌ ముఠా వాడుకున్నదా.. లేదా  నేరుగా  సంబంధాలు ఉన్నాయా  అనేది విచారణలో తేలుతుందన్నారు. 
 
ఎక్సైజ్ శాఖ నోటీసులు అందిన వారిలో హీరోలు రవితేజ, నవదీప్, తరుణ్, తనీష్, నందు, దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కె, ఛార్మీ, ముమైతా ఖాన్, ఆర్ట్ డైరక్టర్ చిన్నా సుబ్బరావు, రవితేజ డ్రైవర్లు ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments