Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి దెబ్బకు పారిపోతున్న టాలీవుడ్ హీరోలు...?

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (21:27 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఇంత అర్జెంట్‌గా ఈ సినిమాని ఎనౌన్స్ చేయడానికి కారణం ఏంటి అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. సినీ పెద్దలు ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాల నిర్మాతలకు నష్టం వస్తుందని.. అది ఇండస్ట్రీకి మంచికాదని చెప్పడంతో ఒక రోజు గ్యాప్‌లో సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇలా ఈ రెండు సినిమాలు రిలీజ్ వెనుక చాలా పంచాయితీలు జరిగాయి.
 
ఇదిలావుంటే.. ఆర్ఆర్ఆర్ 2021లో జనవరి 8న వస్తుండడంతో వచ్చే సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలు ఆర్ఆర్ఆర్‌తో పోటీపడకుండా సమ్మర్‌కి రావాలనుకుంటున్నాయి. మహేష్‌ - వంశీ పైడిపల్లి మూవీ సంక్రాంతికి రావాలనుకున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ వలన సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ... 2021 సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది.
 
ఇక మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయడం కుదరకపోతే 2021 సమ్మర్‌లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నాయి. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయానా సినిమాకి ప్రీక్వెల్ బంగార్రాజు మూవీ చేయనున్నారు. ఈ మూవీని 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుండడంతో 2021 సమ్మర్‌లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారట.
 
ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వస్తుండడంతో సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలన్నీ 2021 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందుచేత రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుడదనే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ 2021 సమ్మర్ లో రిలీజ్ అంటూ ముందుగానే ఎనౌన్స్ చేసారట. అదీ.. ఈ సినిమాని ఇంత అర్జెంట్‌గా ప్రకటించడం వెనకున్న అసలు కారణమని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments