Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ "నిధి"ని మరికొంతకాలం దాచిపెట్టాలనివుంది.. అందుకే దానికి దూరం.. (Video)

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (15:35 IST)
తెలుగు వెండితెరకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ఆమె తొలిసారి వెండితెరకు పరిచయమైంది. ఈ ఒక్క చిత్రంతోనే ఆమె మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. 
 
అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా లభించిన ఖాళీ సమయంలో సింగిల్‌గా ఉన్న హీరోయిన్లలో పలువురు కొంత‌మంది రిలేష‌న్‌షిప్ మెయింటెయిన్ చేయ‌డమో, పెండ్లి చేసుకోవ‌డ‌మో చేశారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం స్టిల్ బ్యాచిలర్‌గా కొనసాగుతోంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, లాక్డౌన్ సమ‌యంలో తాను రొమాంటిక్ రిలేష‌న్‌షిప్ కోసం ఆశపడలేదన్నారు. అంతేకాదు లాక్డౌన్ పీరియ‌డ్ త‌న సింగిల్ స్టేట‌స్ ఏం మార్చ‌లేద‌ని చెప్పింది. పైగా, కొంతకాలంగా సింగిల్‌గానే ఉండాలని భావిస్తున్నానని, అందుకే ఏ ఒక్క హీరోతో డేటింగ్‌ చేయకుండా దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈమె ఓ కుర్ర తెలుగు హీరోతో డేటింగ్‌లో మునిగి తేలుతున్నట్టు వార్తలు రాగా, వాటికి పై విధంగా స్పందించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అశోక్ గ‌ల్లా డెబ్యూట్ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే, తమిళ హీరో శింబుతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త్రినాథ రావు న‌క్కిన దర్శకత్వంలో ర‌వితేజ హీరోగా రానున్న సినిమాలో నిధి అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments