మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (14:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొందరు హీరోలు ఇపుడు తమ సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోతున్నారు. వీరు నటిస్తున్న చిత్రాలకు కనీసం వారు తీసుకుంటున్న పారితోషికాన్ని కూడా తిరిగి రాబట్టలేకపోతున్నారు. ఇలాంటి హీరోల్లో రవితేజ, నితిన్, వరుణ్ తేజ్ వంటి పలువురు హీరోలు ఉన్నారు. ఇలాంటి హీరోల థియేట్రికల్ మార్కెట్ మైనస్‌లోకి వెళ్ళిపోతుంది. 
 
వరుణ్ తేజ్ నటించిన గత మూడు చిత్రాల మినిమం రూ.3 కోట్ల షేర్‌ను కూడా వసూలు చేయలేకపోయింది. అలాగే, మాస్ మహరాజ్ రవితేజ నటించిన నాలుగు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి పరాజయం పాలయ్యాయి. నితిన్‌కు గత నాలుగేళ్ళుగా ఐదు ఫ్లాప్స్ వచ్చాయి. నిన్నమొన్నటివరకు ఓటీటీ డీల్స్ అయినా అయ్యేవి. ఇపుడు ఇలాంటి హీరోల చిత్రాలకు కష్టమైపోయాయి. 
 
ప్రొడక్షన్ హౌస్‌లు తీసే స్టార్ హీరోల సినిమాలతో కలిపి ఈ చిత్రాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'మజాకా' సినిమాకు టాక్ బాగున్నప్పటికీ సందీప్ కిషన్‌కు ఆడియన్స్‌‍ను థియేటర్‌కు రప్పించే ఛాన్స్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వసూళ్ల రాలేదు. ఓవరాల్‌గా స్టార్ హీరోల మినహాయిస్తే మిగతా హీరోల భవిష్యత్ ఇపుడు అగమ్యగోచరం అన్నట్టుగా ఉందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments