Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ సందేశ్ దంపతులపై మీడియాలో జరిగింది విషప్రచారమేనా..?

మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో నిజమో అబద్ధమో తెలియని ఒక వార్త తీవ్ర సంచలనం కలిగించింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రేజీ హీరోగా వెలుగొందిన వరుణ్‌ సందేశ్‌కు సంబంధించిన వార్త అది. ఇటీవలే పెళ్లి చేసుకున్న వరుణ్ సందేశ్ భార్య వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారన

Webdunia
బుధవారం, 12 జులై 2017 (02:54 IST)
మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో నిజమో అబద్ధమో తెలియని ఒక వార్త తీవ్ర సంచలనం కలిగించింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రేజీ హీరోగా వెలుగొందిన వరుణ్‌ సందేశ్‌కు సంబంధించిన వార్త అది.  ఇటీవలే పెళ్లి చేసుకున్న వరుణ్ సందేశ్ భార్య వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని వచ్చిన వార్త సుడిగాలిలా పాకిపోయింది. మంగళవారం రాత్రి సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.
 
వరుణ్‌ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబ కలహాల కారణంగానే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వితిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లున్న ఫొటోలు కూడా సర్క్యులేట్‌ అయ్యాయి. గత ఏడాది ఆగస్టులో వరుణ్‌-వితికల వివాహం జరిగింది. కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
 
కాగా, తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్నవార్తలను వితిక ఖండించారు. ‘అవన్నీ ఫేక్‌ న్యూస్‌. మేం సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దు’ అని వితిక ట్వీట్‌ చేశారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడతానని ఆమె చెప్పారు. ‘పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో వరుణ్‌-వితిక జంటగా నటించారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ.. కొన్నాళ్ల డేటింగ్‌ అనంతరం వివాహ బంధంగా మారింది.
 
ఇది నిజం కాకపోయి ఉంటే మీడియా సత్యసంధతకు ఇది పరీక్షాకాలమే. కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య జరగనిది జరిగినట్లుగా రాయడం నిజమే అయితే ఈ ఘోర తప్పిదానికి ఎవరు బాధ్యత వహించాలి? తప్పు చేసి నాలుక కర్చుకోవడం కాదు మిడియా చేయవలసింది. తానెందుకు ఇలా వ్యవహరిస్తోందో మీడియా ఇప్పటికైనా వెనక్కి తిరగి చూసుకోవలసిన అవసరం లేదా?
 
Vithika Sheru @IamVithikaSheru
Whatever the news is spreading around about us @iamvarunsandesh Everything is a just a rumor. We are doing great.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments