Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్‌లో గాయపడిన రకుల్ ప్రీత్ సింగ్... అభిమానులకు ధన్యవాదాలు...

టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ గాయ‌ప‌డింది. టాలీవుడ్ స్టార్ హీరోల‌తో ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాల్లో న‌టిస్తున్న ర‌కుల్ కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (17:01 IST)
టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ గాయ‌ప‌డింది. టాలీవుడ్ స్టార్ హీరోల‌తో ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాల్లో న‌టిస్తున్న ర‌కుల్ కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు హీరోగా న‌టిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ కొద్ది రోజులుగా యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 
 
హైదరాబాద్‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఛేజింగ్ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించే పనిలో దర్శకుడు మురుగదాస్ ఫుల్ బిజిబిజీగా ఉన్నాడు. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ షూటింగ్‌లో రకుల్ ప్రీత్ గాయపడిందని, ఆమె వేలు విరిగిందని వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో రకుల్ స్పందించింది. తన వేలు విరగలేదని, బెణికిందంటూ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. తాను కోలుకోవాలంటూ చేసిన అభిమానుల మెసేజ్‌లకు తన ధన్యావాదాలని పేర్కొంది. కాగా, ఈ చిత్రం వ‌చ్చే యేడాది ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

TTD: తిరుమలలోని అన్నదానం సత్రం వద్ద తొక్కిసలాట.. బాలుడి మృతి.. నిజమెంత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments