హీరోయిన్ల ఎంపిక పనుల్లో బిజీగా ఉన్న నేచురల్ స్టార్

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (12:16 IST)
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని. నాని మరో హీరో సుధీర్ బాబుతో కలిసి నటించిన చిత్రం 'వి'. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అంటూ ఈ మధ్య వార్తలు రావడం, వాటిని చిత్రయూనిట్ ఖండించడం తెలిసిందే. 
 
అయితే, ఇక ఈ సినిమా తర్వాత నాని వరుసగా సినిమాలు చేసేందుకు సైన్ చేశారు. ఇప్పటికే 'టక్ జగదీష్' అనే చిత్రం లైన్‌లో పెట్టిన నాని, రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'శ్యామ్ సింగరాయ్' అనే టైటిల్‌ కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. లేదంటే ఇప్పటికే సెట్స్‌పై ఉండేది.
 
అయితే, ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారట. నాని మూడు వైవిధ్య కోణాల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. ఈ ముగ్గురి కోసం ఇప్పటికే ఆరుగురిని సెలక్ట్ చేశారని, అందులో నుంచి ముగ్గురుని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్. 
 
రష్మిక మందన్నా, రాశీ ఖన్నా, సాయిపల్లవి, నివేథా ధామస్, నిధి అగర్వాల్, రీతూ వర్మల పేర్లు ఈ చిత్రం కోసం సెలక్ట్ చేసుకున్నారని, ఇందులో ముగ్గురిని ఫైనల్ చేయనున్నారని అంటున్నారు. మరి నాని సరసన నటించే ఆ ముగ్గురు ఎవరో అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అమరావతి: రాజధాని అభివృద్ధికి రైతుల అండ.. భూమిని విరాళంగా ఇవ్వడంపై చర్చ

పంజాబ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి బాగోతం.. ఇంట్లో నోట్ల కట్టలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments