Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా ఒక్క పాట కోసం మూడు కోట్ల ఖర్చా? ఆర్ఆర్ఆర్‌లో అలియా వేసుకునేది బంగారు దుస్తులా?

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (20:45 IST)
టాలీవుడ్ దర్సకధీరుడు రాజమౌళి సినిమా అంటే అద్భుతమైన దృశ్యాల సమాహారంలా ఉంటుంది. కథను అల్లుకునే తీరు, ఆ కథను ఆవిష్కరించే విధానం కథనాన్ని నడిపించే తీరు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. అందుకే ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా రూపొందుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. 
 
ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్ కొమరంభీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామజుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి పెద్ద చర్చే నడుస్తోంది.
 
కేవలం ఒక్క పాట కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. ఈ పాటలో అలియాభట్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అలియా కాస్టూమ్స్ కోసమే దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేయనున్నారట. 
 
అయితే కేవలం ఒక్కపాట కోసం మూడు కోట్ల బడ్జెట్‌ను వెచ్చించడమంటే ఆశ్చర్యపరిచే విషయమే. జక్కన్న అనుకున్నట్లుగా సినిమా చేయడానికి ఎక్కడా వెనక్కితగ్గరనేది అందరికీ తెలిసిందే. ఆయనకు తగ్గట్లుగానే నిర్మాతలు సైతం ఎంత బడ్జెట్ పెట్టేందుకైనా సిద్థంగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. భారతీయ సినిమా చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా ఈ పాట రూపుదిద్దుకోనుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments