పవర్ స్టార్ సరసన ఏజెంట్ హీరోయిన్..?

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (19:40 IST)
Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త హీరోయిన్‌తో జతకట్టనున్నాడనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. "పంజా" మూవీలో సారా జేన్ డయాస్ తెలుగు ప్రేక్షకులకి కొత్త అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో ఆమెకి అప్పటికే మంచి పేరు ఉంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కొత్త హీరోయిన్ తో నటించింది లేదు. 
 
అయితే తాజా సమాచారం ప్రకారం చాలా కాలం తర్వాత ఒక కొత్త అమ్మాయి పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా కనిపించబోతోందట. ఆమె సాక్షి వైద్య. మోడల్‌గా తన కెరీర్‌ను మొదలెట్టిన సాక్షి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఎంపిక అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
 
పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సాక్షి వైద్య ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
నిజానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న " ఏజెంట్ " సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే "ఏజెంట్" సినిమా లో సాక్షి నటన చూసి ఇంప్రెస్ అయ్యి సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఈమెని హీరోయిన్‌గా ఎంపిక చేశారా లేక ఆమె పవన్ కళ్యాణ్ పక్కన బాగుంటుందని అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments