పవన్‌ 28వ సినిమా... ఉగాది రోజున ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (11:47 IST)
పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్‌ 28వ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ఈ ఏడాది ఉగాది రోజున విడుదల చేస్తామని చెప్పారు. సినిమాకు సంబంధించి ఏ విషయమైనా తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడిస్తామని తెలిపారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' సినిమాతో పాటు సాగర్ కె.చంద్రతో చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్లు కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
లాక్డౌన్, అలాగే స్వయంగా తానే కరోనా బారినపడటంతో ఈ సినిమాలు నిలిచిపోయాయి. ఇప్పుడన్నీ సెట్ అయ్యేలా ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పవన్.. వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఆగస్ట్ నుంచి తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న పవన్.. 'ఏకే' రీమేక్‌తో పాటు సమాంతరంగా 'వీరమల్లు' షూటింగ్ కూడా చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. 
 
అయితే ముందుగా ఏకే చిత్రాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
 
ఇక పవన్ కెరీర్లో మొదటి పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ కూడా 45 శాతం పూరైంది. దీని కోసం ఆల్రెడీ ఉన్న సెట్స్‌తో పాటుగా మరికొన్ని భారీ సెట్స్ నిర్మాణం చేయాల్సి ఉందట. అందుకే ముందు 'ఏకే' రీమేక్ ని కంప్లీట్ చేసి.. 'వీరమల్లు'ని సంక్రాంతికి రెడీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments