ఆర్ఆర్ఆర్‌లో ఆ ఎపిసోడ్ అద్భుతం, ఇంతకీ ఏంటది..?

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (16:43 IST)
ఆర్ఆర్ఆర్... ఇప్పుడు వార్తల్లో ఉన్న సినిమా. కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో... సినిమాల ప్రస్తావన కాస్త తగ్గింది. అయితే... ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు స్టార్ట్ అవుతుండటం కొత్త సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకుంటుండటంతో టాలీవుడ్లో మళ్లీ సందడి వాతావరణం స్టార్ట్ అయ్యిందని చెప్పచ్చు. అయితే.. ఇప్పటివరకు అంతగా వార్తల్లో లేని ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
 
కారణం ఏంటంటే ఎన్టీఆర్ టీజర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ వివాదస్పదం అవడంతో బీజేపీ నాయకులు జక్కన్నకు వార్నింగులు ఇవ్వడంతో వివాదం ముదురుతుంది. ఇదిలావుంటే... ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాలో జక్కన్న జలియన్‌వాలా భాగ్ ఉందంతాన్ని కూడా ప్రస్తావించబోతున్నాడట.
 
స్వాతంత్ర్యానికి పూర్వం 1919 ఏప్రిల్ 13 వైశాఖీ పండుగ రోజున అమృత్ సర్ జలియన్ వాలాబాగ్‌లో నిర్వహించిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. 6.5 ఎకరాల స్థలంలో ఉన్న జలియన్ వాలాబాగ్‌కు లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా.. ఒకటే దారి ఉండేది.
 
అయితే... అక్కడ సభ జరుగుతున్న సమయంలో బ్రిటీష్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ వారిపై కాల్పులు జరిపించడంతో 1000 నుంచి 1500 మంది వరకు చనిపోయారని చరిత్రకారులు చెబుతుంటారు. దీనిని ఆర్ఆర్ఆర్‌లో చూపించబోతున్నారని తెలిసింది. ఈ ఎపిసోడ్ కోసం భారీ ఖర్చుపెడుతున్నారని.. తెరపై ఇది అద్భుతం అనేలా ఉంటుందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments