Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను పెళ్లి చేసుకుంటున్నా.. నీవు బ్యాచిలర్‌గా ఉంటే ఎలా'.. అఖిల్ సలహాకు నితిన్ సమ్మతం

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్లలో ప్రభాస్ తర్వాత నితిన్ ఒకరు. వయసు మీదపడుతున్నా.. ఈ ఇద్దరు హీరోలు మాత్రం పెళ్ళిమాటెత్తడం లేదు. అయితే, 'జయం' సినిమాతో హీరోగా మారిన నితిన్... బ్యాచ్‌లర్ లైఫ్‌కు

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (17:17 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్లలో ప్రభాస్ తర్వాత నితిన్ ఒకరు. వయసు మీదపడుతున్నా.. ఈ ఇద్దరు హీరోలు మాత్రం పెళ్ళిమాటెత్తడం లేదు. అయితే, 'జయం' సినిమాతో హీరోగా మారిన నితిన్... బ్యాచ్‌లర్ లైఫ్‌కు శుభం కార్డు వేయాలని నిర్ణయించుకున్నాడు. తనకంటే ఏజ్‌లో చిన్నవాళ్లయిన హీరోలు పెళ్లి చేసుకుంటుండటంతో ఈ కుర్ర హీరో కూడా అదే మార్గంలో పయనించాలని భావిస్తున్నాడు. 
 
అయితే తాజాగా నితిన్ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలికేలా అక్కినేని బుల్లోడు అఖిల్ ప్లాన్ చేశాడట. త్వరలోనే తన స్నేహితురాలు శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్న అఖిల్‌కు, నితిన్‌కు మధ్య మంచి ఫ్రెండ్‌షిఫ్ ఉంది. అఖిల్ హీరోగా తెరకెక్కిన అఖిల్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నితిన్... అక్కినేని యంగ్ హీరోకు క్లోజ్ ఫ్రెండ్‌గా మారిపోయాడనే టాక్ ఉంది. అఖిల్ ప్రేయసి శ్రియా భూపాల్ స్నేహితురాలితో నితిన్‌కు పరిచయం కావడం. అది కాస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారితీయడం చకచకా జరిగిపోయిందట.
 
అలా శ్రియా భూపాల్ ఫ్రెండ్, నితిన్ లవ్ స్టోరీ పెళ్లి వరకు దారితీసింది. త్వరలోనే దీనిపై నితిన్ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి సమంత, చైతూ ప్రేమాయణానికి మధ్యవర్తిగా వ్యవహరించాడని చెప్పుకునే అఖిల్... నితిన్ పెళ్లి విషయంలోనూ అదే రోల్ ప్లే చేసినట్టు కనిపిస్తోంది. మరి ఈ లేటెస్ట్ న్యూస్‌పై నితిన్ ఎప్పుడు రెస్పాండ్ అవుతాడో చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments