Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పదేళ్ళ పాటు మీడియా ముందుకు రానంటున్న టాలీవుడ్ డైరెక్టర్!

మీడియాతో పెద్ద తలనొప్పి వచ్చిపడిందనీ, తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి.. చిక్కుల్లోకి నెడుతోందని, అందువల్ల మరో పదేళ్ళపాటు మీడియా ముందుకు రాకూడదని నిశ్చయించుకున్నట్టు ఆ దర్శకుడు చెబుతున్నాడు. ఇంతకీ ఆ

Webdunia
శనివారం, 8 జులై 2017 (12:53 IST)
మీడియాతో పెద్ద తలనొప్పి వచ్చిపడిందనీ, తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి.. చిక్కుల్లోకి నెడుతోందని, అందువల్ల మరో పదేళ్ళపాటు మీడియా ముందుకు రాకూడదని నిశ్చయించుకున్నట్టు ఆ దర్శకుడు చెబుతున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరన్నదే కదా మీ ప్రశ్న. ఎవరో కాదు.. తేజ. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో "నేనే రాజు.. నేనే మంత్రి" చిత్రం తెరకెక్కుతోంది.
 
రానా, కాజల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల 11న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలో కోసం డైరెక్టర్‌ హోదాలో తేజ మీడియా ముందుకు రావాల్సి ఉంది. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. కొన్ని వివాదాస్పద ప్రశ్నలకు కూడా జవాబులివ్వాలి. అందుకే తేజ ఓ డెసిషన్‌ తీసుకున్నాడట. మీడియా జనాలతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేయ్యాలని నిశ్చయించుకున్నాడట. ఇప్పుడే కాదు మరో పదేళ్ల వరకు మీడియా ముందుకు వెళ్లడకూడదని డిసైడ్‌ అయ్యాడట.
 
ముఖ్యంగా, అర్థంపర్థంలేని ప్ర‌శ్న‌లు అడిగి త‌న‌ని వివాదాల పాలు చేసే మీడియాతో పెద్ద త‌ల‌నొప్పి అని ద‌ర్శ‌కుడు తేజ అన్నారు. అందుకే ప‌దేళ్ల వ‌ర‌కు మీడియాతో మాట్లాడ‌కుండా ఉండేందుకు ప్రయ‌త్నిస్తాన‌ని చెప్పారు.
 
నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో డైరెక్టర్‌ తేజది ఓ విలక్షణమైన శైలి. ఏ విషయం గురించైనా, ఎక్కడైనా ఓపెన్‌గా మాట్లాడడం, కుండబద్దలు కొట్టినట్డు చెప్పడం ఆయన స్టైల్‌. ఈ స్వభావం వల్లే ఆయన ఎన్నో చిక్కులు ఎదుర్కొన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments