Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ‌ల్ల ప్ర‌భాస్ సినిమా టెక్నిక‌ల్‌లో మార్పు

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:51 IST)
aadi purush
కోవిడ్ ప్ర‌తికూల ప‌రిస్థితుల వ‌ల్ల సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లోనూ కొత్త పోక‌డ‌లను ద‌ర్శ‌క నిర్మాతలు వెతుక్కుంటున్నారు. అందులోనూ వంద‌ల కోట్లు పెట్టి తీస్తున్న ప్ర‌భాస్ సినిమా `ఆదిపురుష్‌`కు అడుగ‌డుగునా కొన్ని అడ్డంకులు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. షూటింగ్‌లో వుండ‌గా సెట్ కాలిపోవ‌డం కూడా అప్ప‌ట్లో జ‌రిగింది.
 
పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనోన్ సీత పాత్రలో నటిస్తుంది. రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నారు.
 
కాగా, ఈ సినిమా టెక్నాల‌జీ కొద్దిగా మార్చ‌నున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఓంరౌత్ తన చిత్రం “తనాజీ” తరహాలోనే 3డి టెక్నాలిజీనే ఈ సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. దీనివ‌ల్ల ఔట్‌పుట్ బాగా వ‌స్తుందని, పెట్టిన పెట్టుబ‌డికి గిట్టుబాటు అవుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనివ‌ల్ల విజువ‌ల్‌ప‌రంగా నేత్రానందంగా వుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా కోవిడ్ సినిమాలోనూ మార్పు తెచ్చింద‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments