Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకేంద్రుడు.. బొడ్డుపై కొబ్బరికాయ, పువ్వులు విసరడంపైనే దృష్టి పెట్టాడు.. సారీ చెప్పని తాప్సీ

'ఝుమ్మంది నాదం' సినిమా షూటింగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాపై కాకుండా తన బొడ్డుపై కొబ్బరికాయ... పువ్వులు విసరడం మీదే దృష్టి పెట్టాడంటూ.. ఆ సినిమా హీరోయిన్ చేసిన వెకిలి వ్యాఖ్యలపై పెను దుమారం ర

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (09:12 IST)
'ఝుమ్మంది నాదం' సినిమా షూటింగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాపై కాకుండా తన బొడ్డుపై కొబ్బరికాయ... పువ్వులు విసరడం మీదే దృష్టి పెట్టాడంటూ.. ఆ సినిమా హీరోయిన్ చేసిన వెకిలి వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాప్సీ వ్యాఖ్యలపై నెటిజన్లు, తెలుగు సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తాప్సీపై మండిపడ్డారు. 
 
ఇక‌పై ఆమె న‌టించిన‌ సినిమాలు చూడ‌బోమ‌ని తెగేసి చెబుతున్నారు. తాప్సీ మాత్రం తాను చేసిన కామెంట్ల‌పై ఏమాత్రం తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో తెలుగులో ఆమె నటించిన 'ఆనందో బ్రహ్మ' అనే హారర్ కామెడీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను పూర్తిగా బహిష్కరించాలని.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. 
 
అయితే, ఈ సినిమా విషయంలో తాప్సీకి అందాల్సిన పారితోషికం ఇప్ప‌టికే ఆమెకు అందింది. ఇక‌ ఈ సినిమా విడుద‌ల కాక‌పోయినా, అభిమానులు చూడకపోయినా ఆమెకి నష్టం ఏమీ లేదు. ఆమె చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా త‌మ‌ సినిమా నష్టపోతుందని నిర్మాతలు వాపోతున్నారు. ఈ వివాదం ప‌ట్ల తాప్సీ స్పందించి క్షమాపణలు చెప్పాలని వారు కోరుతున్నారట. కానీ తాప్సీ మాత్రం నోరు విప్పట్లేదట. దీంతో ఆనందో బ్రహ్మ సినిమా నిర్మాతలు తలపట్టుకుని కూర్చున్నారట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments