Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నతనంలో డబ్బు అవసరం.. అందుకే సబ్బు యాడ్స్‌లలో నటించా : సోనాలి బింద్రే

సినీ తారల చర్మ సౌందర్య సాధనం మా సబ్బేనంటూ ఊదరగొట్టే యాడ్స్‌ మనకు తెలుసు. ఫలానా సబ్బు వాడండి.. లేదా ఫలానా క్రీమ్‌ వాడండి.. అచ్చు నాలాగే మీ చర్మమూ నిగనిగలాడుతుందంటూ తారలు యాడ్స్‌లో నటిస్తుంటారు. ఒక్క సౌ

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (12:26 IST)
సినీ తారల చర్మ సౌందర్య సాధనం మా సబ్బేనంటూ ఊదరగొట్టే యాడ్స్‌ మనకు తెలుసు. ఫలానా సబ్బు వాడండి.. లేదా ఫలానా క్రీమ్‌ వాడండి.. అచ్చు నాలాగే మీ చర్మమూ నిగనిగలాడుతుందంటూ తారలు యాడ్స్‌లో నటిస్తుంటారు. ఒక్క సౌందర్య సాధనాలే అనేంటి.. నూడుల్స్‌, కూల్‌ డ్రింక్స్‌.. ఇలా ప్రతి వస్తువునూ సినీతారలు ప్రమోట్‌ చేస్తుంటారు. అభిమాన తారలు యాడ్స్‌ రూపంలో చెప్పే మాటలతో ప్రభావితమై వీరాభిమానులు.. సదరు వస్తువులను కొనడమూ.. ఆయా సంస్థల రెవిన్యూ గణనీయంగా పెరగడమూ తెలిసిందే. 
 
ఎందుకంటే వారి కుండే క్రేజ్ అలాంటిది. ఓ క్రికెట‌ర్ మంచి ఫాంలో ఉంటే చాలు అత‌ని వెంట యాడ్స్ సంస్థ‌లు ప‌రుగెడుతాయి. అలాగే స్టార్ హీరోయిన్‌ని కూడా వ‌ద‌ల‌రు. ముఖ్యంగా సినిమా హీరోయిన్లను ఫెయిర్‌నెస్ క్రీంల యాడ్‌ల‌కు వాడుకుంటారు. సినిమా స్టార్స్ సైతం డ‌బ్బులు వ‌స్తున్నాయి క‌దాని ప్ర‌తి యాడ్‌కు ఒప్పుకుంటారు. అలాగే అన్ని రకాల బ్రాండ్‌లను ప్రమోట్ చేసిన సోనాలి బింద్రే, ఇక పై ఫెయిర్ నెస్ క్రీం యాడ్‌లకు ఎండార్స్ చేయనంటూ ప్రకటించింది. 
 
ఎందుకో తెలుసా.... ఓ టివి కామెడీ షోలో హీరోయిన్ తనీషా చటర్జీ స్కిన్ టోన్‌పై చేసిన కామెంట్స్, వివాదాస్పదమైన నేపథ్యంలో... ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సోనాలి తన నిర్ణయాన్ని ప్రకటించింది. చిన్నవయసులో తనకు డబ్బు అవసరమైనప్పుడు అలాంటి యాడ్స్ చేశాను. కానీ ఇక మీదట ఎవరైనా తనకు అలాంటి ఆఫర్ ఇచ్చినా అంగీకరించనని తేల్చి చెప్పేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments