Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (15:02 IST)
డ్రగ్స్ కేసులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత నుంచి ఆయన డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో చెన్నై నుంగంబాక్కం పోలీసులు సోమవారం హీరో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. అక్కడ శ్రీకాంత్ రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. ఆ తర్వాత నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. 
 
ఇదే డ్రగ్స్ కేసులో అన్నాడీఎం బహిష్కృత నేత ప్రసాద్‌‍తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన విచారిస్తున్నారు. వారిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన శ్రీకాంత్.. సినిమాల్లో అవకాశాల కోసం చిన్నవయసులోనే చెన్నైకు వెళ్లారు. అక్కడ తన పేరును శ్రీకాంత్ లేదా శ్రీరామ్‌గా మార్చుకుని "రోజాపూలు" అనే చిత్రం ద్వారా తమిళం, తెలుగు భాషల్లో హీరోగా పరిచయమయ్యారు. 
 
 
ఆ తర్వాత ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే "హరికథ" అనే వెబ్ సిరీస్‌లో కూడా శ్రీరామ్ నటించారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన స్నేహితులు అనే చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. శ్రీకాంత్ వార్త ఇపుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ బంద్.. కేబుల్ కోత వల్లే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ తన అభ్యర్థిగా గోపీనాథ్ భార్య మాగంటి సునీత

Mithun Reddy: రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయిన మిథున్ రెడ్డి

Sharmila: వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజారెడ్డి నిజమైన రాజకీయ వారసుడు- షర్మిల

Doctors: వైద్యులపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి.. ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments