సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రంలో పదహారణాల తెలుగు ఆడపిల్లగా కనిపించిన హీరోయిన్ అంజలి. ఈమెపై కోలీవుడ్‌లో ఓ రూమర్ హల్‌చల్ చేస్తోంది. గత కొంతకాలంగా తెలుగు వెండితెరకు దూరమైన అంజలి... తెలుగు తెరపై అడ
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రంలో పదహారణాల తెలుగు ఆడపిల్లగా కనిపించిన హీరోయిన్ అంజలి. ఈమెపై కోలీవుడ్‌లో ఓ రూమర్ హల్‌చల్ చేస్తోంది. గత కొంతకాలంగా తెలుగు వెండితెరకు దూరమైన అంజలి... తెలుగు తెరపై అడపా దడపా మాత్రమే కనిపిస్తోంది.
అదేసమయంలో మలయాళం, తమిళ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అక్కడ ఆమె చేసిన 'బెలూన్' సినిమా, త్వరలో విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అంజలి రాజకీయల్లోకి రానుందనే వార్త తమిళనాట షికారు చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడితే అందులో అంజలి చేరే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.
తాజాగా 'బెలూన్' మూవీ ప్రమోషన్లో అంజలి మాట్లాడుతూ... తనకి రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉందని చెప్పింది. రాజకీయ పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తూ ఫాలో అవుతుంటానని అంది. అంతే.. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లోకి రానుందనే ప్రచారం మొదలైయింది. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని ఆ తర్వాత ఆమె చెప్పినా.. ఈ ప్రచారం మాత్రం ఆగకపోవడం గమనార్హం.