Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.ఎస్.రాజమౌళిని ఛీ కొట్టిన తమన్నా.. ఎందుకు..?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీకి ఏమైంది. అస్సలు ఈ మధ్య కనిపించకుండా తిరుగుతోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా మొదట్లో హిట్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. అయితే హిట్ కన్నా మంచి పాత్రలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది మిల్కీ బ్యూటీ. మంచి బలమైన పాత్రలు చేస్తూ ఎక్కడా

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:12 IST)
టాలీవుడ్ మిల్కీ బ్యూటీకి ఏమైంది. అస్సలు ఈ మధ్య కనిపించకుండా తిరుగుతోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా మొదట్లో హిట్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. అయితే హిట్ కన్నా మంచి పాత్రలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది మిల్కీ బ్యూటీ. మంచి బలమైన పాత్రలు చేస్తూ ఎక్కడా గ్యాప్ రానివ్వకుండా దూసుకుపోతోంది తమన్నా. 
 
బాహుబలి హిట్ తరువాత ప్రభాస్, రానా, అనుష్క అందరూ తెగ తిరిగేశారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం పెద్దగా కనిపించలేదు. బాహుబలిలో అవంతిక క్యారెక్టర్‌లో నటించిన తమన్నా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి-2లో ఎక్కువసేపు తనను చూపించాలని రాజమౌళిని చూపించమని కోరితే అది సాధ్యంకాదని ఆయన చెప్పారట. అందుకే ఆమె సినిమా ప్రమోషన్‌కు పూర్తిగా దూరమై పోయిందట. అయితే అప్పట్లో ఈ విషయంపై తమన్నాను మాట్లాడిస్తే నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను. సినిమా ప్రమోషన్స్‌కు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పింది. 
 
కానీ అసలు విషయం ఏంటంటే రాజమౌళి తనకు సినిమాలో సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్లనే బాగా హర్టయ్యిందట తమన్నా. మరోసారి రాజమౌళి సినిమాలో నటించకూడదని నిర్ణయించుకుని ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పిందట. అయితే స్నేహితులు మాత్రం అలాంటి పని చేయొద్దని 100 సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క రాజమౌళి సినిమాలో ఒక్క దాంట్లో నటించినా ఆ క్రేజ్ వేరని చెప్పారట. అయితే అందుకు తమన్నా ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఈ మధ్య కాలంలో రాజమౌళి ఫోన్ చేస్తే మాట్లాడనని ముఖం మీద చెప్పేసిందట. టాప్ డైరెక్టర్‌తో సినిమా చేయనని చెబుతున్న తమన్నా తెలుగు సినీపరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు పడబోతోందో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments