Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహాతో అదరగొట్టనున్న తమన్నా, పారితోషికం ఎంతో తెలిస్తే అదిరిపోతారు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (17:23 IST)
ఆహా.. అంటూ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ క్రియేట్ చేయడం తెలిసిందే. దీనిని సక్సెస్ చేయడం కోసం అల్లు అరవింద్ టాప్ స్టార్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. క్రిష్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి... ఇలా సక్సస్‌ఫుల్ డైరెక్టర్స్‌కి ఆహాను ఓహో అనిపించే బాధ్యతను అప్పగించారు.
 
ట్రెండ్‌కి తగ్గట్టుగా వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్స్ రూపొందించేందుకు స్ర్కిప్ట్‌లు సెలెక్ట్ చేయడం... వీరి బాధ్యత. ప్రస్తుతం కొన్ని స్ర్కిప్టులు ఫైనల్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే.. కరోనా కారణంగా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇదిలా ఉంటే... ఆహా కోసం అల్లు అరవింద్ మిల్కీ బ్యూటీ తమన్నాను రంగంలోకి దింపారని తెలిసింది.
తమన్నాతో టాక్ షో చేయించి.. ఆహాకు మరింత ఆదరణ లభించేలా చేయాలనుకుంటున్నారు. అయితే... తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అనేది ఆసక్తిగా మారింది. తెలుగును స్పష్టంగా మాట్లాడే తమన్నా ఈ షోతో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఒక్కో ఎపిసోడ్‌కు తమన్నాకు 8 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారని టాక్. తమన్నాతో టాక్ షో చేయించాలనే ప్లాన్ బాగానే ఉంది. మరి.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యి ఆహాకు ఆశించిన ఆదరణ లభిస్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments