Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారి శింబు సరసన తమన్నా... కోలీవుడ్‌లో దశ తిరుగుతుందా?

కోలీవుడ్ నటుడు శింబు హీరోగా శ్రియ హీరోయిన్‌గా 'ఎఎఎ' అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఓ పాత్ర

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (09:13 IST)
కోలీవుడ్ నటుడు శింబు హీరోగా శ్రియ హీరోయిన్‌గా 'ఎఎఎ' అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఓ పాత్రలో శ్రియ నటిస్తుండగా, మరో పాత్రకు తమన్నాను ఎంపిక చేశారు. అధిక్‌ రవిచంద్రన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా సినిమా విషయాన్ని ప్రకటించారు. తొలిసారి తమన్నా శింబు సరసన నటిస్తోందని ట్వీట్‌ చేశారు. 
 
ఇదిలావుంటే... ఇటీవలే ఆర్య సరసన తమన్నా చేసిన ''వాసువుం శరవణనుమ్ ఒన్న పదిచ్చవంగా'' సినిమా సూపర్ హిట్ అయింది. బాహుబలి చూపిన ప్రభావం... తమిళంలో ఆర్య జోడిగా చేసిన సినిమా సక్సెస్ కావడంతో అక్కడ తమన్నాకి అనూహ్యమైన స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు అక్కడి దర్శకనిర్మాతలు తమన్నా ఇంటి ముందు క్యూ కడుతున్నారు. 
 
మరోవైపు ''వాలు'' సినిమాతో చాలాకాలం తర్వాత సక్సెస్ చూసిన శింబు, తమన్నా క్రేజ్ తనకి మరో హిట్ ఇస్తుందనే ఆనందంతో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం 1980 నాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇటీవల శ్రియ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments