Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌-ఐటెం గర్ల్‌కు తేడాలేదు.. డబ్బు కోసమే ఇండస్ట్రీకి వచ్చా: తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ఒక్క పాట కోసం రూ.కోటి ఖర్చు చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళం తీస్తున్న ''ఒక్కడొచ్చాడు'' అనే చిత్రంలో ఆమె విశాల్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సూరజ్‌ దర

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (11:30 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ఒక్క పాట కోసం రూ.కోటి ఖర్చు చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళం తీస్తున్న ''ఒక్కడొచ్చాడు'' అనే చిత్రంలో ఆమె విశాల్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సూరజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.హరి నిర్మిస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్‌ నుంచి నిర్మాతగా మారిన ఆయన ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఫైటర్‌ కనల్‌ కన్నన్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రించారు. అవి పూర్తయ్యాక తమన్నాతో ఓ సాంగ్‌ చిత్రించేందుకు సెట్‌ను సిద్ధం చేశారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఐటెం సాంగ్‌ల్లో తళుక్కు మంటుంది.
 
పాలరంగు వంటి తన అందాలను తగిన వొంపు సొంపులతో ఐటెం పాటలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. కాగా ఈ పాల బుగ్గల సుందరి ఒక్కో ఐటెం పాటకు రూ.50 లక్షల నుంచి కోటీ రూపాయల వరకు రెమ్యునరేషన్‌గా అందుకుంటోంది. అయితే తాజాగా కన్నడ హీరో నిఖిల్‌ సినిమా 'జాగ్వర్‌' కోసం చేసిన ఐటెం సాంగ్‌కు దాదాపు రూ.2 కోట్లు అందుకుంది. 
 
తను కేవలం డబ్బుల కోసమే ఐటెం సాంగ్‌లు చేస్తోందన్న విమర్శలపై మిల్క్ బ్యూటీ తమన్నా ఘాటుగా స్పందించింది. దీనిపై అందాల రాక్షసీ స్పందిస్తూ 'నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది డబ్బులు సంపాదించడానికే. ఐటెంపాటలే కాదు.. హీరోయిన్‌గా నటించేది కూడా డబ్బుల కోసమే. కథానాయికగానూ, ఐటెం భామగానూ నేను డబ్బులు బాగానే తీసుకుంటున్నా. నా దృష్టిలో ఆ రెండూ వేర్వేరు కాద'ని చెప్పింది అమ్మడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్

వైసీపీ నేత పోసాని కృష్ణమురళికు ఇక్కట్లు.. కడపలో కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. పది మంది శిశువులు సజీవ దహనం

పుప్పల్ గూడ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం.. ఎవరికి ఏమైందంటే? (video)

వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments