Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయిష్టంతో సినీ ఫీల్డుకొచ్చా... ఇపుడు ఇష్టంతో కంటిన్యూ అవుతున్నా : తాప్సీ

ఢిల్లీ సొట్ట బుగ్గల చిన్న తాప్సీ పొన్ను. ఈ అమ్మడు కెరీర్ ఇపుడు పీక్‌ స్టేజ్‌లో ఉంది. ఇది అందరూ ఒప్పుకునే విషయమే. ఒకప్పుడు తాప్సీని ఐరన్‌ లెగ్‌ అన్నారు. సినిమాలకి పనికి రాదు అన్నారు. అలా అన్నోళ్లే ఇప్ప

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (11:20 IST)
ఢిల్లీ సొట్ట బుగ్గల చిన్న తాప్సీ పొన్ను. ఈ అమ్మడు కెరీర్ ఇపుడు పీక్‌ స్టేజ్‌లో ఉంది. ఇది అందరూ ఒప్పుకునే విషయమే. ఒకప్పుడు తాప్సీని ఐరన్‌ లెగ్‌ అన్నారు. సినిమాలకి పనికి రాదు అన్నారు. అలా అన్నోళ్లే ఇప్పుడు ఫలానా క్యారెక్టర్‌కు తాప్సీ తప్ప మరో ఆప్షన్‌ లేదు అంటున్నారు. తాప్సీకి ఇంత పేరు ఒక్క సినిమాతోనే, రాత్రికి రాత్రే రాలేదు. దీనివెనుక ఏడు సంవత్సరాల కృషి ఉంది దాగివుందని చెపుతోంది తాప్సీ. 
 
ఆరంభంలో తనకు సినీ కెరీర్‌పై ఇష్టం లేదు. మోడలింగ్‌లో కొద్దిగా పేరు వచ్చిన తర్వాత వెండితెర మీద అవకాశాలు వచ్చాయి. అసలు నేను మోడలింగ్‌ చేయడం, సినిమాల్లో చేయడం మా వాళ్ళకి ఇష్టం లేదు. మోడలింగ్‌ చేసే రోజుల్లో నా పేరెంట్స్‌ నా గురించి తెగ టెన్షన్‌ పడేవారు. సక్సెస్‌ అవుతానా? కానా? అని కాదు. నలుగురూ నా గురించి ఏమనుకుంటారో అన్నది వారి భయం. మోడల్‌గా మంచి పేరు వచ్చిన తర్వాత వారిలో సంతోషం మొదలైంది. అంత అయిష్టత మధ్య ఈ ఫీల్డులోకి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత ఇష్టం కలిగింది. ఇక్కడే కంటిన్యూ అయిపోతున్నాను. 
 
ఇకపోతే... దక్షిణాది అనుభవం ఇక్కడ బాగా పనికి వచ్చింది. మొదట్లో ఏ క్యారెక్టర్‌కూ పనికి రానని అన్నారు. ఇప్పుడు తాప్సీ తప్ప మరో ఆప్షన్‌ లేదు అంటున్నారు. కొన్ని కథలు నా కోసమే తయారు చేస్తున్నారు. దక్షిణాదిన ఎక్కువ సినిమాలు చేసినా రాని గుర్తింపు ఉత్తరాదిన రెండు మూడు సినిమాలకే వచ్చింది. ఇదే చాలా సంతోషాన్ని ఇస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments