"బీరువా" సురభికి మరో ఛాన్స్...

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (11:27 IST)
'బీరువా' అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన నటి సురభి. ఈ చిత్రంలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. 2013లో ఓ తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కోలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌కు 'బీరువా' అనే చిత్రం ద్వారా పరిచయమైంది. సురభికి మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. 
 
టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలను బాగానే ఆకట్టుకుంది. దాంతో ఇక్కడ 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ఎటాక్', 'జెంటిల్‌మాన్' వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో కూడా సురభికి మంచి గుర్తింపు దక్కింది. కానీ వరసగా అవకాశాలు మాత్రం దక్కించుకోవడంలో బాగా వెనకబడింది. 2019లో 'ఓటర్ అన్న' సినిమా తర్వాత రీసెంట్‌గా 'శశి' అన్న సినిమాలో నటించింది.
 
ఈనెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. సురభి కూడా ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటుందని చెప్పుకుంటున్నారు. 
 
'శశి' సినిమాలో ఉన్న 'ఒకే ఒక లోకం నువ్వే' సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మళ్ళీ అందరి దృష్టి సురభి మీద పడిందని తెలుస్తోంది. ఈ సినిమా మీద సురభి చాలా నమ్మకాలు పెట్టుకోగా హిట్ టాక్ వస్తే మాత్రం మళ్ళీ యంగ్ హీరోల సినిమాలలో వరసగా అవకాశాలు దక్కించుకుంటుందని నమ్మకంగా ఉందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments