Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజీ‌లో సూపర్ స్టార్ కృష్ణ.. అతిథి పాత్రలో...

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2016 (10:28 IST)
'నాన్నకి ప్రేమతో' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ''జనతా గ్యారేజ్''. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కొరటాల శివ గత సినిమాలు ''మిర్చి'', ''శ్రీమంతుడు'' సూపర్ హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్, సుహాసిని మణిరత్నం, ఉన్నిముకుందన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
 
ఈ సినిమాలో ఇంకొక కీలక పాత్ర కోసం సత్యరాజ్‌ని తీసుకోవడానికి కొరటాల శివ ప్రయత్నించాడట. అయితే సత్యరాజ్ ప్రస్తుతం 'బాహుబలి 2'తో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారట. దాంతో ఈ పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించారట కొరటాల శివ. 'జనతా గ్యారేజీ' సినిమాలో ఎన్టీఆర్‌కి తండ్రి పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. 
 
సూపర్ స్టార్ కృష్ణని కొరటాల వెళ్లి సంప్రదిస్తే, యంగ్ టైగర్‌తో నటించడానికి నేనెప్పుడు సిద్దమే అని ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనితో ఈ సినిమా పై ఉన్నఅంచనాలు రెట్టింపైంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగస్ట్ 12న ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ కలిసి అప్పట్లో తెర పంచుకున్నారు. ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణతో కలిసి కృష్ణ నటించారు. ఇప్పుడు నందమూరి మూడోతరం జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సూపర్ స్టార్ కృష్ణ తెర పంచుకోవడం గమనార్హం. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments