Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడేమో ఎండలో.. ఇప్పుడేమో వానలో.. సమంత షూటింగ్ కష్టాలు అబ్బబ్బా..!

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానికి అనంతరం కూడా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా వున్న సమంత.. షూటింగ్ స్పాట్స్‌లో తాను ఎదుర్కొనే కష

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (15:27 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానికి అనంతరం కూడా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా వున్న సమంత.. షూటింగ్ స్పాట్స్‌లో తాను ఎదుర్కొనే కష్టాల గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. చైతూతో పెళ్లికి తర్వాత కూడా సమంతకు సినీ ఆఫర్లు ఏమాత్రం తగ్గలేదు. చేతిలో వున్న సినిమాల షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది సమంత. 
 
గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ''రంగస్థలం'' చిత్రంలో నటిస్తున్న సమంత.. అప్పట్లో రాజమహేంద్రవరంలో మండుటెండల్లో షూటింగ్‌లో పాల్గొని వడదెబ్బకు గురైంది. ప్రస్తుతం అదే తరహా కష్టాన్ని ఎదుర్కొంటోంది. కోలీవుడ్ మూవీ సూపర్ డీలక్స్ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
 
ఈ సినిమా కోసం రాత్రివేళల్లో వర్షంలో జరిపే షూటింగ్‌లో సమంత పాల్గొంటుందట. చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సెట్స్‌కి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్టు చేసింది. రాజమహేంద్రవరంలో ఎండలో, చెన్నై వానలో షూటింగ్.. దేవుడా తనతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్ అంటూ ఏడుస్తున్న ఇమేజ్‌ను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 
 
ఇకపోతే.. ఈ ఏడాది సమంత నటించిన రంగస్థలం మార్చి 29న, అభిమన్యుడు మార్చి 30న, మహానటి సినిమా కూడా అదే మార్చిలో విడుదల కానుంది. ఇక సమంత చేతిలో శివ కార్తీకేయన్‌తో ఓ సినిమా, విజయ్ సూపర్ డీలక్స్, యూటర్న్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments