Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతపై ఫైరైన సుమంత్... ఏం జ‌రిగింది..?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (16:39 IST)
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం ఇదం జ‌గ‌త్. ఈ చిత్రం ఈ నెల 28న రిలీజైంది. ఈ చిత్రంలో సుమంత్ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ పోషించారు. ఇంకా చెప్పాలంటే... ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి నెగిటివ్ షేడ్ క్యారెక్ట‌ర్ చేసాడు. దీనిపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ... ఈ సినిమా ఫ‌ర‌వాలేద‌నిపించింది కానీ... క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. దీనికి కార‌ణం ఈ సినిమా రిలీజైంది అనేది ఫిల్మ్ స‌ర్కిల్స్‌లోనే స‌రిగా తెలియ‌దు. ఏమాత్రం ప‌బ్లిసిటీ లేదు.
 
దీంతో సుమంత్‌కి బాగా కోపం వ‌చ్చింద‌ట‌. నిర్మాత‌కు ఓ లేఖ రాసాడ‌ట‌. ప‌బ్లిసిటీ చేయ‌లేన‌ప్పుడు సినిమా తీయ‌డం ఎందుకు..? అంటూ లేఖలో పేర్కొన్నాడట. ఇప్ప‌టివ‌ర‌కు త‌న సినిమాల‌కు ఎప్పుడూ ఇంత త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాలేదనీ, ప‌బ్లిసిటీ చేయ‌లేమ‌ని ముందే చెప్పుంటే అది నేనే చూసుకునేవాడిని క‌దా అని చాలా సీరియ‌స్ అయ్యాడ‌ట‌. సుమంత్ చెప్పిందాంట్లో నిజం ఉంది. కానీ.. ఇప్పుడు తెలుసుకుని ఏం ప్ర‌యోజ‌నం. జ‌ర‌గాల్సింది జ‌రిగిపోయింది. ఇకనైనా సుమంత్ ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments