Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌తో సుకుమార్ సినిమా... మరో రంగస్థలమేనా?

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం లండ‌న్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వా

Webdunia
శనివారం, 28 జులై 2018 (21:35 IST)
అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం లండ‌న్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత అఖిల్ స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టితో సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా అఖిల్ గురించి మరో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... అఖిల్ హీరోగా సుకుమార్ ఓ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధమవుతోందట. అయితే ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించడంలేదట.
 
సుకుమార్ కథతో అతని అసిస్టెంట్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేప్టటే అవకాశముందని తెలుస్తోంది. ఆల్రెడీ సుకుమార్ ఓ స్టోరీ లైన్‌ని నాగ్‌కి చెప్పాడట. అఖిల్ కూడా ఈ కథ విన్నాడట. నాగ్, అఖిల్ ఇద్దరూ ఈ స్టోరీ లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుకుమార్ బ్యానర్లో సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాకి సుకుమార్‌తో పాటు నాగార్జున‌ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారట. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments