Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈగ సీక్వెల్‌కు రెడీ అవుతున్న రాజమౌళి.. భద్రకు తల్లి ఎవరో చెప్పిన భల్లాలదేవ?

బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన రాజమౌళి.. తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. బాహుబలి వంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన రాజమౌళి.. తదుపరి ప్రాజెక్టు ఏం చే

Webdunia
బుధవారం, 10 మే 2017 (16:40 IST)
బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన రాజమౌళి.. తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. బాహుబలి వంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన రాజమౌళి.. తదుపరి ప్రాజెక్టు ఏం చేస్తారనేదానిపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫిలిమ్ నగర్ వర్గాల్లో రాజమౌళి ఈగ సీక్వెల్ తీసేందుకు ప్లాన్ జరుగుతున్నట్లు టాక్ వస్తోంది.
 
ఈగ సినిమాను నిర్మించిన వారాహి చలన చిత్ర సంస్థనే ఈగ సీక్వెల్‌ను కూడా నిర్మిస్తుందని సమాచారం. సీక్వెల్‌లోనూ నానినే టైటిల్ రోల్ పోషిస్తాడని, ఇందులో నాని రోల్‌ను మరింత పెంచే దిశగా స్క్రిప్ట్ వర్క్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రికార్డులను బ్రేక్ చేస్తోంది. తాజాగా బాహుబలి-2 కూడా ప్రశ్నలను మిగిల్చింది. అలాంటి వాటిలో ఒకటే భద్ర భల్లాల దేవకు పుత్రుడిగా పుట్టడం. 
 
బాహుబలి-2 రిలీజ్‌కు తర్వాత భల్లాలదేవుడి భార్య ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. భద్ర (అడివిశేష్‌)ను భల్లాలదేవ కుమారుడిగా మొదటి భాగంలో చూపించారు. దేవసేనను భల్లాలదేవ చెర నుంచి విడిపించే సమయంలో భద్రను చంపుతాడు మహేంద్ర బాహుబలి(శివుడు). కానీ బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరో చూపిస్తారని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. 
 
ఈ నేపథ్యంలో భద్ర తల్లి ఎవరనే ప్రశ్నకు రానా సరాదాగా సమాధానం ఇచ్చాడు. సరోగసి ద్వారా భద్ర పుట్టాడని, అతడికి తల్లి లేదని జవాబిచ్చాడు. దీంతో ప్రేక్షకులు ప్రశ్నకు సమాధానం దొరికినట్లైంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments