Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎన్ఎస్ వార్నింగ్... శ్రీదేవి చిత్ర షూటింగ్‌కు బ్రేక్...రాం గోపాల్ వర్మ ఏమంటున్నాడు...

ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అతిలోక సుందరి శ్రీదేవి. ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో విజయ్ హీరోగా నటించిన పులి సినిమాలో కీలక పాత్రలో తళుక్కుమని మెరిసింది. ఈ భామ తాజాగా మరో సి

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (14:14 IST)
ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అతిలోక సుందరి శ్రీదేవి. ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో విజయ్ హీరోగా నటించిన పులి సినిమాలో కీలక పాత్రలో తళుక్కుమని మెరిసింది. ఈ భామ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాణ సారథ్యంలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న "మామ్"సినిమాను రవి ఉడయవర్ డైరెక్ట్ చేస్తున్నారు. 
 
ఈ తాజా ప్రాజెక్టులో శ్రీదేవీతోపాటు మరో కీలక పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పోషించనున్నారు. పాకిస్థాన్ నటులు అద్నాన్ సిద్ధికీ, సజల్ అలీ నటిస్తున్నారు. దీంతో పాకిస్థాన్ సెగ ఇప్పుడు ఈ సినిమాకు కూడా తగిలింది. ఇంతకీ విషయం ఏమంటే.. ఆమె నటిస్తున్న సినిమాలో ఇద్దరు పాకిస్థాన్ నటులు నటించడంతో షూటింగ్ కూడా జరగని పరిస్థితి ఏర్పడిందట. 
 
కాగా ఈ సినిమాలో శ్రీదేవి భర్తగా అద్నాన్ సిద్ధికీ నటిస్తుండగా, కూతురుగా సజల్ అలీ నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్‌ను ముంబైలో మొదలు పెట్టాల్సి ఉంది. అయితే, ఎంఎన్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో మామ్ షూటింగ్‌కు బ్రేక్ చెప్పారట యూనిట్ సభ్యులు. 
 
ఇప్పటికే ఈ చిత్రానికి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించడంతో పాక్ నటులకు బదులు వేరే నటులతో రీషూట్ చేయడం ఇబ్బందికరంగా మారుతుందని బోనీకపూర్ వాపోతున్నాడట. కాబట్టి పొలిటికల్ వేడి చల్లారేవరకు వేచి ఉంటే బెటరని నిర్ణయం తీసుకున్నారట. మరి ఈ పొలిటికల్ వేడి ఎప్పుడు చల్లారుతుందో.. శ్రీదేవి సినిమాకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాలి. మరోవైపు ఈ సినిమాపై రాం గోపాల్ వర్మ ఏ విధంగా స్పందిస్తాడోనని బాలీవుడ్‌లో ఆసక్తి రేగుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments