Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న శ్రీదేవి కుమార్తె!! (Video)

Webdunia
బుధవారం, 22 జులై 2020 (08:36 IST)
భారతీయ చిత్ర పరిశ్రమ అతిలోక సుందరి శ్రీదేవి. ఈమె కుమార్తె జాన్వీ కపూర్. దఢక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ, తన తల్లి శ్రీదేవికి స్టార్‌డమ్ చేకూర్చిపెట్టిన తెలుగులో మాత్రం ఆమె ఎంట్రీ ఇవ్వలేక పోయింది. 
 
శ్రీదేవిలా జాన్వీని కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారని భావించి, టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎందరో ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేయాలని చూశారు. చిరు, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ చేయాలని, అందులో జాన్వీ కపూర్‌ని నటింపచేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె మాత్రం ఈ ఆఫర్లను తిరస్కరిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టు ఫైటర్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీని తీసుకుని టాలీవుడ్‌కి ఆమెని పరిచయం చేయాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె బిజీగా ఉన్నానంటూ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. కానీ ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఆఫర్స్ వదులుకుని తప్పు చేశానని ఫీలవుతుందట. 
 
దీనికి కారణం లేకపోలేదు. ఆమెకి టాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పుడు బిజీ అని చెప్పి చేసిన చిత్రాలన్నీ ఇప్పుడు థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. వెండితెరపై తన వైభవాన్ని చూసుకోవాలనుకున్న ఆమె కోరిక అస్సలు నెరవేరలేదు. ఇప్పుడామె నటించిన చిత్రాలన్నీ ఓటీటీ బాటే పడుతున్నాయి. దీంతో ఆమె బాగా డిజప్పాయింట్ అవుతుందట. 
 
అందుకే టాలీవుడ్‌ నుంచి వచ్చిన ఆఫర్లను ఎందుకు వదులుకున్నానా? అని ఎంతో ఫీలవుతుందట. అయితే ఎక్కడైనా ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి కదా!. థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేనప్పుడు ఏ నిర్మాతలైనా.. చేసేది అదే కదా..! దీనికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ ఆమె సన్నిహితులు జాన్వీకి నచ్చజెపుతున్నారట. ఏది ఏమైనా చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకున్న చందంగా జాన్వీ కపూర్ పరిస్థితి మారింది.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments