Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీరాజా, న‌రేష్ క‌లిసిపోయారు... తెర వెన‌క ఏం జ‌రిగింది..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఈమ‌ధ్య కాలంలో బాగా వార్త‌ల్లో ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సినిమాని వార్త‌ల్లోకి తీసుకువ‌స్తే... ఇప్పుడు శివాజీరాజా, సీనియ‌ర్ న‌రేష్ క‌లిసి మరోసారి వార్త‌ల్లోకి తీసుకువ‌చ్చారు. యు.ఎస్‌లో మా సెల‌బ్రేష‌న్స్

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (20:07 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఈమ‌ధ్య కాలంలో బాగా వార్త‌ల్లో ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సినిమాని వార్త‌ల్లోకి తీసుకువ‌స్తే... ఇప్పుడు శివాజీరాజా, సీనియ‌ర్ న‌రేష్ క‌లిసి మరోసారి వార్త‌ల్లోకి తీసుకువ‌చ్చారు. యు.ఎస్‌లో మా సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా తీసుకెళ్లారు. అయితే... ఈ ఈవెంట్ నిధులు దుర్వినియోగం జ‌రిగాయంటూ న‌రేష్ మీడియాకెక్క‌డంతో వివాద‌స్ప‌దం అయ్యింది. న‌రేష్ వ్యాఖ్య‌ల‌కు శివాజీరాజా కూడా ఘాటుగా స‌మాధానం చెప్ప‌డం.. దుర్వినియోగం జ‌రిగాయ‌ని నిరూపిస్తే త‌న ఆస్థి అంతా రాసి ఇచ్చేస్తాన‌నడంతో ఈ వివాదం మ‌రింత ముదిరింది.
 
అయితే... న‌రేష్, శివాజీరాజా ఇద్ద‌రూ కూడా చిరంజీవి పేరు ప్ర‌స్తావించ‌డంతో చిరుకి బాగా కోపం వ‌చ్చింద‌ట‌. అంతే... ఇద్ద‌రినీ ఇంటికి పిలిచి బాగా క్లాస్ తీసుకున్నార‌ట‌. మ‌రోవైపు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కూడా న‌రేష్, శివాజీరాజా ఇద్ద‌రూ మీడియాకెక్కి ఇండ‌స్ట్రీ ప‌రువు తీసేస్తున్నార‌ని చెప్పారు. దీంతో చిరంజీవి, సురేష్ బాబు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ రంగంలోకి దిగి ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించార‌ట‌. ఇంకెప్పుడు ఇలా మీడియాకెక్కి ప‌రువు తీయ‌వద్ద‌ని చెప్పార‌ట‌. దీంతో న‌రేష్ - శివాజీరాజా మామ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పారు. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments