Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ సునీత డైరీ ఫుల్.. బుల్లితెరపై ఎంట్రీ.. కుమార్తెను సెటిల్ చేయాలని..?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (14:31 IST)
ప్రముఖ సింగర్ సునీత-రామ్ వీరపనేనిల వివాహం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సునీత తమ కొత్త వైవాహిక జీవితానికి సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా ద్వారా తరచూ చెబుతూనే ఉంది. తాజాగా సునీత తన జీవితంలో వచ్చిన కొత్త వ్యక్తి అయిన రామ్ వీరపనేని పట్ల చాలా కేరింగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం సునీత తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 
 
అటు రామ్ వీరపనేని సైతం సింగర్ సునీత కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా వివాహం జరిగిన తర్వాత వేలంటైన్ డే సందర్భంగా సునీతను సర్ ప్రైజ్ చేసేందుకు రామ్ వీరపనేని ఒక విలువైన కానుక ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
 
ముఖ్యంగా సునీత తన వివాహం తర్వాత కుమార్తె కెరీర్ సెట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. సునీత కుమార్తె శ్రేయ ఇప్పటికే నేపథ్య గాయనిగా మంచి పేరు సంపాదించింది. అంతేకాదు సునీత పేరును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతోంది.
 
ఇక సునీత కుమారుడు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అతడు సైతం తన విద్యాభ్యాసం అయిన తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం చేయడం ద్వారా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. అటు రాం వీరపనేని సైతం సునీత పిల్లల కెరీర్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక సునీత సైతం ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్స్ ప్రకారం షోస్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. దీంతో సునీత త్వరలోనే బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. 
 
అలాగే పలువురు హీరోయిన్లు సునీత గాత్రం ఎప్పుడు దొరుకుతుందా ఎదురు చూస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఆ కమిట్స్ మెంట్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇక సునీత ఇలా బిజీగా తన డైరీ మొత్తం పూర్తి చేయాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments