''సుచీలీక్స్'' వచ్చేస్తున్నా.. ఎలా వెళ్లానో అలాగే తిరిగొచ్చా: సుచిత్ర

''సుచీలీక్స్'' అంటేనే సినిమా వారికి భయం. వామ్మో అంటూ జడుసుకుంటూ పారిపోతారు. ఎందుకంటే హీరోహీరోయిన్ల అఫైర్లు వాటి తాలూకు ఫోటోలు సుచీలీక్స్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వైరల్ అయిన ఫోటోల్లో రాన

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (10:26 IST)
''సుచీలీక్స్'' అంటేనే సినిమా వారికి భయం. వామ్మో అంటూ జడుసుకుంటూ పారిపోతారు. ఎందుకంటే హీరోహీరోయిన్ల అఫైర్లు వాటి తాలూకు ఫోటోలు సుచీలీక్స్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వైరల్ అయిన ఫోటోల్లో రానా, త్రిష, ధనుష్, ఆండ్రియా, అనిరుధ్‌లు కూడా వున్నారు. తాజాగా సుచీలీక్స్ పేరిట మళ్లీ రానున్నానని గాయని సుచిత్ర వెల్లడించింది. 
 
తాను ఎలా వెళ్లానో అదేవిధంగా తిరిగి వచ్చేసానని తెలిపింది. ఈ క్రమంలో పలువురు నటీనటుల బాగోతాలను విడుదల చేయనున్నానని చెప్తూ.. ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో కోలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. గతంలో తన ట్విట్టర్ ఖాతాలో నటీనటుల ప్రైవేటు ఫొటోలను సుచిత్ర విడుదల చేయగా, తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. 
 
అయితే, అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, ఆ ట్వీట్లతో తనకు సంబంధం లేదని సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రస్తుతం సుచిత్ర తిరిగి వచ్చేశానంటూ.. నటీనటుల బాగోతాలను విడుదల చేస్తాననంటూ వీడియో ద్వారా తెలపడం కోలీవుడ్‌లో సంచలనం రేకెత్తిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments