అదితి రావు హైదరితో ప్రేమలో వున్న సిద్ధార్థ్? నా హృదయ రాకుమారి..?

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (22:43 IST)
బొమ్మరిల్లు స్టార్ హీరో సిద్ధార్థ్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమలో వున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ జంట తెలుగులో మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది
 
ఇప్పటికే సిద్ధు ఎఫైర్స్ గురించి, బ్రేకప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత పెళ్లి అవ్వనంత వరకు ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. 
 
ఇక గత కొంత కాలంగా ఈ హీరో, హీరోయిన్ అదితి రావు హైదరితో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
 
ఇక ఆ అనుమానాన్ని నేడు నిజం చేసేసాడు సిద్దు. నేడు అదితి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఎంతో స్పెషల్ గా విషెస్ తెలుపుతూ తన ప్రేమ వ్యవహారం నిజమే అని చెప్పుకొచ్చాడు.
 
"నా హృదయ రాకుమారి అదితిరావు హైదరి హ్యాపీ హ్యాపీ బర్త్ డే.. నీ కలలన్ని నిజం కావాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఇది బెస్ట్ ట్రిప్.." అంటూ రాసుకొచ్చాడు. ఇక ఆ ఫోటోలో సైతం సిద్దు ఎదపై వాలిపోయి అదితి కనిపించింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? సుప్రీంకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments