Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిన్‌ షోకు హద్దులు: శ్రుతిహాసన్

స్కిన్‌ షోకు హద్దులు: శ్రుతిహాసన్

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (12:31 IST)
రేసు గుర్రం లాంటి పలు చిత్రాలలో విచ్చలవిడిగా అందాలారబోసి అభిమానుల ఉర్రూతలూగించిన శ్రుతి హాసన్ ఇకపై స్కి‌న్ షోకు హద్దులుంటాయంటోంది. లోకనాయకుడి వారసురాలిగా రంగ ప్రవేశం చేసిన ఈ భామ తొలి రోజుల్లోనే హిందీ చిత్రం లక్‌లో శ్రుతి మించిన శృంగారంతో విమర్శలు మూటకట్టుకున్నారు. 
 
ఆ తరువాత కూడా హిందీ, తెలుగు భాషల్లో అందాలారబోస్తూ గ్లామర్‌ డాలర్‌గా పేరు పొందారు. అయితే తమిళ చిత్రాల్లో మాత్రం గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకుంటున్నారనే ఆరోపణలు వెల్లడయ్యాయి. ఆమె తమిళంలో 3, 7 ఆమ్ అరివు చిత్రాల్లో నటించారు. తాజాగా నటించిన పూజై చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. 
 
ఈ సందర్బంగా శృతిహాసన్ మాట్లాడుతూ తానెలా నటించాలన్న విషయంలో సొంత నిర్ణయాలు ఏమీ లేవన్నారు. అది నటించే పాత్రను బట్టే ఉంటుందన్నారు. ఇక గ్లామర్ విషయంలో కూడా అదే వర్తిస్తుందన్నారు. అంతేగాని హిందీ, తెలుగు చిత్రాల్లో మాత్రమే  గ్లామర్‌గా నటిస్తున్నానని, తమిళ చిత్రాల్లో స్కిన్ షో కు దూరంగా అభిమానులను నిరాశపరుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 
 
ఏదేమైనా ఇకపై లాంటి విమర్శలకు దూరం అవడానికి ఏ భాషా చిత్రంలో నైనా స్కిన్ షో విషయంలో కొన్ని పరిమితులు విధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు శ్రుతి హాసన్ వెల్లడించారు.

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

Show comments