Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్టింగ్ కూడా ఉద్యోగమే.. భర్తకు-అత్తకు నచ్చలేదంటే ఎలా? పెళ్లై పిల్లలు పుట్టినా నటిస్తా: శ్రుతిహాసన్

పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం కాలేదని.. దర్శకుడు విజయ్ అమలాపాల్‌తో విడాకులు తీసుకున్న నేపథ్యంలో సినీ లెజెండ్ కుమార్తె శ్రుతిహాసన్.. పెళ్లైన తర్వాత హీరోయిన్ల పరిస్థితిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. త

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:25 IST)
పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం కాలేదని.. దర్శకుడు విజయ్ అమలాపాల్‌తో విడాకులు తీసుకున్న నేపథ్యంలో సినీ లెజెండ్ కుమార్తె శ్రుతిహాసన్.. పెళ్లైన తర్వాత హీరోయిన్ల పరిస్థితిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన పదునైన మాటలతో చర్చకు తెరలేపింది. పెళ్లిపై ముక్కుసూటిగా సమాధానం ఇచ్చింది. తద్వారా తండ్రిని మించిన తనయగా పేరు కొట్టేసింది.  
 
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల స్థితిగతులపై శ్రుతి స్పందించింది. సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరోలకే కట్టబెట్టడం తగదని గట్టిగానే విమర్శిస్తోంది.  అయితే ఇటీవల కాలంలో... హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం స్వాగతించదగ్గ పరిణామమని శ్రుతి తెలిపింది. అంతేగాకుండా పెళ్లైన నాయికలు సినిమాలకు దూరమవ్వడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నిస్తోంది. తన విషయంలో అలాంటి జరగదని శ్రుతిహాసన్ హామీ ఇస్తోంది. 
 
హీరోయిన్లు పెళ్లైన తర్వాత భర్తకు ఇష్టం లేదని, లేకుంటే అత్తగారు వద్దన్నారనో సినిమాలకు దూరం కావడం అత్యంత దారుణమైన పరిణామంగా శ్రుతిహాసన్ పేర్కొంది. యాక్టింగ్‌ను కూడా ఇతర ఉద్యోగాల్లాగే చూడాలని విన్నవించుకుంటోంది. తనకు పెళ్లైనా.. పిల్లలు పుట్టినా కూడా నటిస్తూనే ఉంటానని శ్రుతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. నటన అంటే తనకు ప్రాణమని శ్రుతిహాసన్ చెప్పింది. మరి శ్రుతిహాసన్ పెట్టిన కండిషన్స్‌కు ఓకే చెప్పే వరుడు ఎక్కడున్నాడో మరి..?

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments