Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ గురించి సీక్రెట్‌ చెప్పిన శ్రుతిహాసన్‌

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (11:07 IST)
Shruti Haasan, Prabhas
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సినిమా సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత ఆయనకు అంత రేంజ్‌ హిట్‌ ఏ సినిమా తెచ్చిపెట్టలేదు. ఆమధ్య విడుదలైన రామాయణ గాథ ఆదిపురుష్‌ ఆయనకు వ్యధగా మారిందనేది లోకోక్తి. ఇక టైంమిషన్‌ నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ సినిమాలో చేస్తున్నాడు. ఇది విడుదలకు చాలా సమయం వుంది. అయితే కె.జి.ఎఫ్‌. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఏడాదికిపైగా రూపొందుతున్న సలార్‌ సినిమా పై ఆశలు ఫ్యాన్స్‌లో నెలకొన్నాయి. కానీ సినిమా అనుకున్నటైంకు రాకుండా వాయిదా పడుతూవచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. త్వరలో మరో డేట్‌ను ప్రకటించనున్నారు.
 
ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ నటించింది. ఇటీవలే హైదరాబాద్‌లో ఏ వ్యాపారప్రచారానికి హాజరైంది. సలార్‌ గురించి చెబుతూ, తనకూ ఎంతో ఆతృతగా వుందని విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నట్లు చెప్పింది. ప్రభాస్‌ గురించి చెబుతూ.. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి వుండే లక్షణం ఆయలో చూశాను. చాలా హంబుల్‌ పర్సన్‌. చాలా గౌరవంగా మాట్లాడతాడు. సీన్‌లో ఇన్‌వాల్వ్‌ అయి ఏదేనా టేక్‌లోతప్పు చెప్పినా తను సర్దుకుపోయి పర్వాలేదు. మరో టేక్‌ కు ఓకే అంటూ తోటి నటుట్ని ఎంకరేజ్‌ చేస్తారంటూ కితాబిచ్చింది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు నటించారు. హాంబలే ఫిలిమ్స్‌పై విజయ కిరాగందుర్‌ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments